చిన్నారి పెళ్ళికూతురు ఆత్మహత్యకు కారణాలివే 

Reasons for Pratyusha Banerjee suicide

01:32 PM ON 2nd April, 2016 By Mirchi Vilas

Reasons for Pratyusha Banerjee suicide

డబ్బింగ్ సీరియల్ ‘చిన్నారి పెళ్లికూతురు’లో ఆనందిగా తెలుగు టీవీ ప్రేక్షకులకు చిరపరిచితురాలైన ప్రముఖ బుల్లితెర నటి 24 ఏళ్ల ప్రత్యూష బెనర్జీ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు భావిస్తున్నారు. ముంబై శివార్లలోని బంగూర్‌నగర్‌లో తన సొంత ఫ్లాట్‌లో సీలింగ్‌కు ఉరి వేసుకుందని స్థానిక పోలీస్ అధికారి తెలిపారు. పలువురు ఆమె మృతి ఆత్మహత్య కాదేమోనని అనుమానాలు వ్యక్తం చేశారు. ప్రత్యూష మృతి పై సహనటులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. శుక్రవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగిన సాయింత్రం వరకూ ఈ విషయం బయటకు తెలియరాలేదు. మరణానికి ఖచ్చితమైన కారణం పోస్ట్‌మార్టం అనంతరమే తెలుస్తుందని పోలీసులు చెబుతున్నారు.

ప్రత్యూష బెనర్జీ టీవీ ప్రొడ్యూసర్ అయిన తన బాయ్‌ఫ్రెండ్ రాహుల్ రాజ్ సింగ్‌తో సంబంధించి ఆమె ఇబ్బందులను ఎదుర్కొంటోందని సన్నిహిత వర్గాలు తెలిపాయి. అయితే తన చివరి వాట్సాప్ సందేశంలోనూ.. ‘మరణం తరువాత కూడా నీ నుంచి ముఖం తిప్పడంలేదు’ అని ఒక స్మైలీతో పాటు ఉంది. ఝార్ఖండ్‌కు చెందిన ప్రత్యూష.‘బిగ్‌ బాస్‌ -7’, ‘ఝలక్‌ దిఖ్‌లాజా -5’ వంటి రియాలిటీ కార్యక్రమాల్లోనూ పాల్గొంది. చివరగా టీవీ షో ‘హమ్‌ హై నా’లో కనిపించింది. ‘బాలికా వధు’లో చిన్నారి ఆనంది పాత్రను అవికా గోర్ పోషించగా, పెద్దయ్యాక ఉండే పాత్రను ప్రత్యూష పోషించింది. ఇక 2013లో ఆ పాత్ర నుంచి ఆమె తప్పుకుంది.

ఆ తరువాత ఆ పాత్రను మరో నటి పోషిస్తోంది. మొత్తానికి ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసిన ప్రత్యూష 24 ఏళ్ళకే నిండు నూరేళ్ళు నిండిపోవడం పట్ల పలువురు దిగ్బ్రాంతి చెందుతున్నారు.

English summary

Reasons for Pratyusha Banerjee suicide. Chinnari Pelli Kuthuru serial fame Pratyusha Banerjee get suicde.