తరచూ అలసట చెందడానికి 7 కారణాలు

Reasons of Tiredness

09:28 AM ON 19th January, 2016 By Mirchi Vilas

Reasons of Tiredness

బిజీగా ఉన్న ఈ జీవనశైలిలో అలసట అనేది సాదారణమే. కొన్ని జీవనశైలి మార్పుల ద్వారా అలసటను దూరం చేసుకోవచ్చు. ప్రతి రోజు  పరిపూర్ణమైన ఆహారం తినటం, తగినంత నిద్ర, తగినన్ని ద్రవాలు తీసుకోవటం,మల్టీవిటమిన్ తీసుకోవటం మరియు కెఫిన్ మరియు ఆల్కహాల్ మానేయటం వంటివి చేయాలి. ఈ మార్పులను చేసిన తర్వాత కూడా అలసట ఉంటే కనుక, ఒక  ప్రొఫెషనల్ సాయం తీసుకోవలసిన అవసరం ఉంది. తీవ్రమైన అలసట అనేది ఒక తీవ్రమైన వైద్య పరిస్థితికి సంకేతం కావచ్చు. ఇక్కడ అలసటతో ఉన్నారని చెప్పటానికి 7 సాదారణ కారణాలు ఉన్నాయి.

1/8 Pages

1. రక్తహీనత

రక్తహీనత కారణంగా ఎర్ర రక్త కణాలు లేకపోవటం వలన కణజాలం మరియు కణాలకు ఆక్సిజన్ అందదు.దాంతో  శ్వాస కూడా చాలా బలహీనంగా ఉంటుంది. రక్తహీనత కారణంగా ఐరన్ లేదా విటమిన్ లోపం , రక్త నష్టం, అంతర్గత రక్తస్రావం,
రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి దీర్ఘకాలిక వ్యాధి, క్యాన్సర్, మూత్రపిండాల వైఫల్యం వంటివి సంభవిస్తాయి.

లక్షణాలు

అన్ని సమయాల్లోనూ అలసిన ఫీలింగ్ ఉంటుంది. అలాగే తీవ్ర బలహీనత, నిద్ర లేమి, ఏకాగ్రత లేకపోవడం, గుండె వేగంగా కొట్టుకోవటం, ఛాతీ నొప్పులు, తలనొప్పి వంటివి కూడా ఉంటాయి. మెట్లు ఎక్కటం, తక్కువ దూరం నడవటం వంటి సాదారణ వ్యాయామంనకు కూడా అలసట వస్తుంది.

పరీక్షలు

రక్తహీనతకు భౌతిక పరీక్ష మరియు రక్త పరీక్షలు, ఒక సంపూర్ణ రక్త గణన (CBC), ఎర్ర రక్త కణాల స్థాయిలు తనిఖీ వంటి పరీక్షలు చేయించుకోవాలి.

English summary

Reasons of Tiredness. Here are the 7 most common problems you need to know about.