చెన్నై కాలేజీలో అసభ్య నృత్యాలు

Recording dance in college

01:28 PM ON 7th April, 2016 By Mirchi Vilas

Recording dance in college

వల్గర్ గా ఉంటున్నాయని రికార్డింగ్ డాన్సులు నిషేధించి, కళాకారుల పొట్ట కొట్టారు. కానీ వాటిని మించి కాలేజీల్లో ఇప్పుడు డాన్సులు చేసేస్తుంటే అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. తాజాగా చెన్నైలోని ప్రెసిడెన్సీ కాలేజీలో అసభ్య నృత్యాలు కలకలం రేపాయి. కాలేజీ వార్షికోత్సవం సందర్భంగా ఓ తమిళ సినిమా పాటకు అమ్మాయిలు వల్గర్ గా డ్యాన్సులు చేశారు. అయితే ఈ తతంగం వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇది ఫేక్ వీడియో అని కళాశాల ప్రిన్సిపల్ ప్రేమానంద పెరుమాళ్ కొట్టి పారేస్తున్నారు. అయితే ఈ యవ్వారం జరిగిన మాట నిజమేనని, కానీ ఈ కాలేజీ విద్యార్థులు ఇలా చేయలేదని, బయట నుంచి వచ్చిన యువతుల బాగోతమిదని కళాశాల పూర్వ విద్యార్థి సంఘం నాయకుడు అంబరసు వెర్షన్ గా ఉంది.

ఇది కూడా చదవండి: ఎయిర్‌పోర్ట్‌లో మనిషి పుర్రెతో ప్రయాణికుడు

ప్రిన్సిపల్ కూడా ఈ ఈవెంట్ కు హాజరయ్యాడని విద్యార్థులు చెబుతుండగా.. ఇనాగురేషన్ తర్వాత తాను వెళ్ళిపోయానని ప్రిన్సిపల్ పెరుమాళ్ సెలవిస్తున్నారు. ఏమైనా మంచి పేరున్న ఈ కాలేజీలో ఈ వల్గర్ డ్యాన్సుల వ్యవహారం తీవ్ర విమర్శలకు దారి తీసింది. తల్లిదండ్రులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: ఎయిర్‌పోర్ట్‌లో మనిషి పుర్రెతో ప్రయాణికుడు

English summary

Recording dance in college. Girls vulgar dance in Chennai Presidency college.