సిగ్గుచేటు.. అన్నవరం దేవుని సన్నిధిలో రికార్డింగ్ డ్యాన్స్(వీడియో)

Recording Dances at Annavaram temple

05:13 PM ON 12th March, 2016 By Mirchi Vilas

Recording Dances at Annavaram temple

తూర్పు గోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి గుడి ప్రాంగణంలో అపచారం జరిగిపోయింది. సాక్షాత్తు ఆ సత్యదేవుడు శ్రీ సత్యన్నారాయణ స్వామి కొలువైవున్న ఆ గుడి ప్రాంగణంలో అశ్లీల నృత్యాలు జరిగాయి. అమ్మాయిలు రెచ్చిపోయి మరి అర్ధనగ్నంగా నృత్యాలు చేస్తే, ఆ అమ్మాయిలతో కలిసి మగాళ్లు తప్పతాగి చిందులేశారు. ఈ అపచారం దేవాలయంలోని హరిహర సదన్ వద్ద శుక్రవారం రాత్రి జరిగిన ఓ పెళ్లి వేడుకలో చోటు చేసుకుంది. ఈ పెళ్ళికి స్థానిక టిడిపి సర్పంచ్ హరిబాబు, మండల అధ్యక్షుడు యడ్ల బేతాళుడు తదితరులు ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. వీళ్ళ ఎదురుగానే మహిళా డ్యాన్సర్లు రికార్డింగు డ్యాన్స్ లు చేశారు.

ఇంత అపచారం జరుగుతున్నా ఆ దృశ్యాలని అధికారులు, పోలీసులు చూస్తూ ఉండిపోయారే తప్ప ఏ మాత్రం పట్టించుకోలేదు. ఇవి చాలవన్నట్లు మగాళ్లు పీకల దాకా తాగి ఆ అమ్మాయిలతో కలిసి డ్యాన్స్ లు చేశారు. దీని పై భక్తులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవుడున్న ప్రాంగణంలో ఇలాంటివి ఏంటని ప్రశ్నించారు. ఇటువంటి రికార్డింగ్ డ్యాన్స్ లు ఏర్పాటు చేసిన వారి పై పోలీస్ కేసు నమోదు చేస్తామని ఆలయం ఈవో తెలియజేశారు. తెల్లవారు జామున 3 గంటలకు జరగడంతో ఈ నృత్యాల సంగతి మా దృష్టికి రాలేదు, సిసిటీవీ ఫుటేజీలను పరిశీలించి ఈ సంఘటన పై విచారణ జరిపిస్తామని చెప్పారు.

English summary

Recording Dances at Annavaram Satyanarayana Swamy temple. Here a marriage hase been held, In this marriage recording dances was the attraction.