కేశవ రెడ్డిపై రికవరీ యాక్ట్ ప్రయోగిస్తారట!

Recovery act will be produced on kesava reddy says home minister

12:09 PM ON 7th November, 2016 By Mirchi Vilas

Recovery act will be produced on kesava reddy says home minister

చేసినన్నాళ్లు ఏది చేసినా ఆహా ఓహో అనిపిస్తుంది. తీరా యవ్వారం బయటపడితేనే అసలు విషయం తెలుస్తుంది. ఇంతకీ విషయం ఏమంటే, కర్నూలు కేంద్రంగా పలు విద్యా సంస్థలను ఏర్పాటు చేసిన కేశవరెడ్డి హడావిడి చూసి అబ్బో అన్నారు. తీరా ఇప్పుడు రికవరీ యాక్ట్ ప్రయోగించే స్థాయికి వచ్చింది. ఎన్నో ఏళ్ళుగా విద్యార్థులను, వారి తలిదండ్రులను మోసగిస్తూ వచ్చిన ఆ సంస్థల అధినేత కేశవ రెడ్డిపై రికవరీ చట్టాన్ని ప్రయోగిస్తామని ఏపీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. ఈ చట్టంతో కేశవ రెడ్డి బాధితులకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్టు ఆయన చెప్పుకొచ్చారు.

కేశవ రెడ్డి అక్రమాలు తెలుసుకుని ఆశ్చర్యపోయానని చినరాజప్ప విస్తుపోయారు. తనపై కేసులున్నా కేశవ రెడ్డి బయట స్వేచ్ఛగా తిరగడం, అనుచరులకు ఫోన్లో సూచనలు, సలహాలు ఇవ్వడం విడ్డూరంగా ఉందన్నారు. ఇలాంటి వారిని చట్టం ముందు నిలిపి కఠినంగా శిక్షిస్తామని చినరాజప్ప తెలిపారు. మహానంది మండలంలో జరిగిన జన చైతన్య యాత్రలో ఆయన పాల్గొన్నారు.

English summary

Recovery act will be produced on kesava reddy says home minister