కారులో ఆమె ... బయట బుసలు కొడుతున్న పాము .. ఇంతకీ ఏమైంది? (వీడియో)

Red Bellied Black Snake on the Car

10:55 AM ON 6th January, 2017 By Mirchi Vilas

Red Bellied Black Snake on the Car

నోము సినిమాలో కారులో పాము దూరడం వంటి సీన్లుంటాయి. కానీ ఇది సాధ్యమా అనుకుంటాం. కానీ నిజంగా జరిగింది. పూర్తివివరాల్లోకి వెళ్తే, ఓ మహిళ ఒంటరిగా గంటకు 100 కిలోమీటర్ల వేగంతో కారులో ప్రయాణిస్తోంది. ఆ సమయంలో హఠాత్తుగా కారు బానెట్ మీద ఓ పాము ప్రత్యక్షమైంది విషయంలో. అడిలైడ్ నుంచి ముండూ ఐలాండ్ స్టేషన్ కు కారులో శాలీ గ్రండీ అనే మహిళా బయలు దేరింది. ఆమె గమ్యం చేరుకోవడానికి ఇంకా ఓ గంట పడుతుందనగా వూహించని అనుభవం ఎదురైంది. కారు ఇంజిన్ లోంచి ఓ నల్లటి పాము బానెట్ పైకి వచ్చింది. రావడం రావడం అద్దం లోంచి అది శాలీనే చూడడంతో ఆమె పై ప్రాణాలు పైనే పోయాయి.

ఎంత అద్దానికి బయటే ఉన్నా అది పామే. పైగా విషపూరితమైనది. అది ఏ క్షణానైనా ఇంజిన్ లోనికి వెళ్లి కారు లోపలికి కూడా రావచ్చు. శాలీకి ఏం చేయాలో తోచలేదు. దానినలా చూస్తూనే మరో గంట కారు నడిపింది. దారిలో ఓ పొలం కన్పిస్తే పాము పొలంలోకి వెళ్లిపోతుందేమోనన్న ఆశతో అక్కడ కాసేపు ఆపింది. అయినా లాభం లేకపోవడంతో అలాగే గమ్యానికి చేరుకుంది. మర్నాటి ఉదయం వరకు పాము కారు ఇంజనులోనే ఉండిపోయిందంటూ ఆ ఫొటోను, తాను తీసిన వీడియో తన ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ చేసింది. విపరీతంగా ఈ వీడియో హల్ చల్ చేస్తోంది.​

English summary

Red Bellied Black Snake on the Car.