రెడ్ క్వీన్ కి పోలీసుల షాక్

Red Sandal Smuggler Sangeeta Chaterjee To Bring Chittoor

05:36 PM ON 12th May, 2016 By Mirchi Vilas

Red Sandal Smuggler Sangeeta Chaterjee To Bring Chittoor

మొదట్లో ఎయిర్ హోస్టెస్ గా పని చేసి.. ఆ తర్వాత మోడల్ గా అవతారం ఎత్తి ..అటు పైన లాభసాటి కోసం ఎర్రచందనం లేడీ స్మగ్లర్ గా రూపాంతరం చెందిన సంగీత ఎర్ర చందనం అక్రమ రవాణాలో కోట్లాది రూపాయిల బిజినెస్ చేస్తూ.. ‘రెడ్ క్వీన్’ గా పేర్గాంచింది. అయితే ఇప్పుడు ఈ వ్యవహారం మరో మలుపు తిరిగింది. ఎట్టకేలకు ఆమెకు షాక్ ఇవ్వటంలో ఏపీ పోలీసులు సక్సెస్ అయ్యారనే చెప్పాలి. ఈ అంతర్జాతీయ లేడీ స్మగ్లర్ ను చిత్తూరు కోర్టుకు తీసుకురావాలన్న ప్రయత్నాలు ఫలించాయి.

ఇవి కూడా చదవండి:ఎర్రగడ్డ పిచ్చి ఆసుపత్రిలో చేరిన టాలీవుడ్ హీరో

మొదట్లో ఆమెను తక్కువగా అంచనా వేసి.. కోల్ కతాకు వెళ్లి అదుపులోకి తీసుకొని.. ఆమెను చిత్తూరు కోర్టుకు తరలించేందుకు ప్రయత్నించిన చిత్తూరు పోలీసులకు ఆమె తన రేంజ్ ఏమిటో చూపించింది. ఆమెను అదుపులోకి తీసుకున్న వెంటనే పాతిక మంది లాయర్లు సీన్లోకి వచ్చేసి ఆమెకు బెయిల్ వచ్చేలా చేయటంతో ఏపీ పోలీసులు షాక్ తిన్నారు.

ఇవి కూడా చదవండి:బాలకృష్ణ ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్నాడు

రెడ్ క్వీన్ నేరాల చిట్టాను ఆధారాలతో బయటపెట్టి.. ఆమెను చిత్తూరు కోర్టుకు తీసుకురావాలన్న ప్రయత్నాలు తాజాగా ఫలించాయి. తాజాగా రెండోసారి సెర్చ్ వారెంట్ తో వెళ్లిన చిత్తూరు పోలీసులు.. అక్కడి కమిషనర్ తో ఆమె విషయాన్ని చర్చించి ఆమె ఇంటిని సోదా చేశారు. ఈ సందర్భంగా పలు బ్యాంకు ఖాతాలు.. నగలు.. లాకర్లను ఫ్రీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆమెకు సంబంధించి మరిన్ని ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. ఎర్రచందనం స్మగ్లర్ గా పేరున్న లక్ష్మణ్ ఆమెను రెండో పెళ్లి చేసుకున్న విషయాన్ని గర్తించారు. ఆమె ఆస్తుల్ని ఫ్రీజ్ చేసిన చిత్తూరు పోలీసులు ఆమెపై కేసులు నమోదు చేశారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఆమె ఈ నెల 18న చిత్తూరు కోర్టుకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి.. రెడ్ క్వీన్ చిత్తూరు కోర్టుకు వస్తుందా? మరేదైనా డ్రామా ఆడి మస్కా కొడుతుందా .. చూద్దాం ..

ఇవి కూడా చదవండి:సిక్స్ ప్యాక్ తో అదరగొడుతున్న హీరోయిన్

ఇవి కూడా చదవండి:హనీమూన్ లో రచ్చరచ్చ చేస్తున్న బిపాసా

English summary

Chittoor Police to bring Red Sandal Lady Smuggler Sangeeta Chaterjee to be arrested and to bring Chittoor by Chittoor Police. She was one of the accused person in Red Sandal Smuggling in Chittoor.