టాస్క్‌ఫోర్స్‌ పై ఎర్ర చందనం కూలీల రాళ్ల వర్షం

Red Sandal Wood Smugglers Attack On Police

09:57 AM ON 29th January, 2016 By Mirchi Vilas

Red Sandal Wood Smugglers Attack On Police

ఎర్ర చందనం కూలీలు రెచ్చిపోయారు. కూబింగ్ చేస్తున్న సిబ్బందిపై రాళ్ళ దాడి చేసారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని శేషాచలం అడవుల్లో రేగిన అలజడి వివరాల్లోకి వెళితే, గురువారం అర్ధరాత్రి టాస్క్‌ఫోర్స్‌ ఆర్‌ఎస్‌ఐ భాస్కర్‌ ఆధ్వర్యంలో కూంబింగ్‌ నిర్వహిస్తున్న ప్రత్యేక కార్యదళానికి రాగిమానుకుంట వద్ద సుమారు 150 మంది ఎర్రచందనం కూలీలు కనిపించారు. పోలీసులు తక్కువ సంఖ్యలో ఉండటంతో ఎర్రచందనం కూలీలు వారిని చుట్టిముట్టి రాళ్ల వర్షం కురిపించారు. ఆత్మరక్షణ కోసం పోలీసులు ఓ రౌండు గాలిలో కాల్పులు జరిపారు. దీంతో ఎర్రచందనం కూలీలు అక్కడి నుంచి పారిపోయారు. ఈసందర్భంగా అధికారులు ఆ పరిసర ప్రాంతంలో 104 ఎర్రచందనం దుంగలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.4కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. విషయం తెలుసుకున్న ప్రత్యేక కార్యదళం డీఐజీ కాంతారావు హుటాహుటీన ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.

కాగా చంద్రగిరి మండలం సి.మల్లవరం వద్ద పూతలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో తవేరా వాహనంతో పాటు 24 ఎర్రచందనం దుంగలను కూడా స్వాధీనం చేసుకున్నారు.

English summary