భర్తని జైలుకి పంపిన టీవీ యాంకర్‌

Reddy Tortured By His Wife Who Is Anchor

03:58 PM ON 15th March, 2016 By Mirchi Vilas

Reddy Tortured By His Wife Who Is Anchor

జీవితంలో పెళ్ళి చేసుకుని సంతోషంగా బతకాలని అందరూ కలలు కంటారు. అలాగే రెడ్డి కూడా కల కన్నాడు. కాని ఆ కలే అతడిని జైలు గోడలమధ్య బందీ అయ్యేలా చేసింది. వివరాల్లోకి వెళితే అతడిది సికింద్రాబాద్‌ లోని బోయగూడ. అతడు 2005 కు ముందు ఒక మంచి బిజినెస్‌ మేన్‌. రెడ్డి ఒక రోజు పెళ్ళి చేసుకుందామనుకున్నాడు. ఓమంచి అందమైన అమ్మాయిని పెళ్ళి చేసుకుంటే జీవితం మరింత ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటుంది అనుకుని తాను కలగన్నట్టుగానే ఓ టీవీ యాంకర్‌ని రెడ్డి పెళ్ళి చేసుకున్నాడు. కొన్నాళ్ల పాటు వీరి జీవితం సాఫీగానే సాగింది. మొదట్లో చాలా హ్యాపీగానే వీళ్ళ జీవితం కొనసాగింది ఆ తరువాత మొదలయ్యింది వీళ్ళ జీవితంలో ట్విస్ట్‌.

పెళ్ళి తరువాత జీవితం ఎంతో బాగుంటుందని అనుకున్నా కానీ ఆపెళ్ళే నన్ను సర్వనాశనం చేస్తుందని గ్రహించలేదని రెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. అంతేకాదు తాను అనుభవించిన నరకాన్ని చెప్పుకొచ్చాడు. తాను పెళ్ళి చేసుకున్నాక ఇంట్లో బంగారం మాయం అయ్యేదని, అలాగే డబ్బులు కూడా కనిపించేవి కాదని ఇలా 5 సంవత్సరాలు కొనసాగిందని వెల్లడించాడు. ఆ డబ్బు ఎలా పోతుందో అర్ధం కాక నరకం చూసాను. అసలు కధ ఏమిటో...ఎలా బంగారం మాయం అవుతుందో తెలుసుకుందాం అని ఆరాతీస్తే కట్టుకున్న భార్యే దొంగ అని తెలిసింది అని చెప్పారు. అయితే భార్య దొంగ అని ఒప్పుకోలేక ఒక పధకం ఆలోచించాడు రెడ్డి. ఇంట్లో కెమెరాలను అమర్చాడు. ఆ తర్వాత రోజు కెమెరాలో రికార్డ్‌ అయిన దృశ్యాలను చూసి ఆశ్చర్యపోయాడు. అతడి జేబులో ఉన్న డబ్బు స్వయంగా అతడి భార్య దొంగ తనం చేస్తుంటే తట్టుకోలేక పోయాడు. ఈ సంఘటన తరువాత వారిరువురి మధ్య గొడవయ్యింది.

అయితే వారికి ఇద్దరు పిల్లలు ఉండడంతో రెడ్డి విడిపోడానికి సిద్దపడలేదు. కాని ఆమె విడిపోయింది. అంతేకాదు అతని భర్తపై నేరాలు మోపి జైలుకి పంపింది. అతడు వేరే అమ్మాయిలతో తిరుగుతున్నాడని, బ్లూఫిల్మ్‌ చేసి అమ్ముతున్నాడని ప్రచారం చేసింది. ఈమెకు మహిళా సంఘాల మద్దతు లభించడంతో రెడ్డి మీద కేసులు పెట్టి జైలుకి పంపింది. తనని జైలుకి పంపి ఆమె మాత్రం వేరే వ్యక్తితో సంతోషంగా ఉంటుందని కన్నీళ్ళు పెట్టుకున్నాడు.

రెడ్డి ఆ వేదన మీరుకూడా చూడండి

English summary

Reddy Tortured By His Wife Who Is a TV Anchor