త్వరలో భారత్ లోకి రెడ్‌మీ నోట్ 2 ప్రైమ్

Redmi Note 2 Prime to lauch in India

04:50 PM ON 11th December, 2015 By Mirchi Vilas

Redmi Note 2 Prime to lauch in India

చైనా దిగ్గజ సంస్థ షియోమీ తన కొత్త మొబైల్ రెడ్ మీ నోట్ 2 ప్రైమ్ ను భారత్ లో విడుదల చేసేందుకు సిద్ధమైంది.

ఈ ఏడాది ఆగస్టులో చైనాలో రెడ్‌మీ నోట్ 2 ప్రైమ్‌ను విడుదల చేసింది షియోమీ. ఈ ఫోన్ సక్సెస్ కావడంతో మరికొద్ది రోజుల్లోనే భారత్‌లోనూ ఈ స్మార్ట్‌ఫోన్‌ను విక్రయించేందుకు సన్నాహాలు చేస్తోంది. అమెజాన్ సైట్ ద్వారా అతి త్వరలోనే ఇది వినియోగదారులకు లభ్యం కానుంది. దీని ధర రూ.10,400.

ఇందులో 4జీ, 5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1920X1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2.2 జీహెచ్‌జడ్ మీడియాటెక్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్(దీనిని 32 జీబీ వరకు పెంచుకోవచ్చు), 13 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 3060 ఎంఏహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ 5.0 లాలిపాప్ వంటి ఫీచర్లు ఉన్నాయి. కాగా ఈ ఫోన్ విడుదల తేదీని త్వరలోనే వెల్లడిస్తామని ఆమెజాన్ ఇండియా తన వెబ్ సైట్ లో పేర్కొంది.

English summary

Chineese mobile company had planning to release its new smart called redmi note2 prime in India