ముఖం మీద రంద్రాలు, మచ్చలకి చెక్‌

Reduce Acne scars naturally at home

07:14 PM ON 30th November, 2015 By Mirchi Vilas

Reduce Acne scars naturally at home

ముఖం మీద రంద్రాలు ఏర్పడడం వల్ల చాలా మంది నిరుత్సాహానికి గురవుతారు. అసలు రంద్రాలు పడటానికి చాలా కారణాలు ఉన్నాయి. కొంతమంది మొటిమలను చేతితో గిల్లుతారు. ఇంకొంతమంది బలవంతంగా మొటిమలను గోటితో పీకేస్తారు. ఇలాంటి వారికి ఈ సమస్య అధికంగా ఉంటుంది. మరికొందరిలో వారి శరీరతత్వం వల్ల ముఖం మీద గుంటలు ఏర్పడతాయి. మొటిమలు తగ్గిపోయినా వాటి జ్ఞాపకాలు ఇంకా మీ ముఖాన్ని వదిలి వెళ్ళవు. అటువంటివారు ఈ చిట్కాలను పాటించడం వల్ల ఫలితం ఉంటుంది.

  1. మొటిమల వల్ల మచ్చలు బాగా డార్క్‌ రంగులో ఉంటే దానికి నిమ్మకాయ మంచి ఫలితాన్ని ఇస్తుంది. నిమ్మకాయ రసంలో దూదిని ముంచి మచ్చలకి రాసుకొని 15 నిమిషాల సమయం గడిచిన అనంతరం ముఖాన్ని చల్లని నీటితో కడగాలి. ఇలా చెయ్యడం వల్ల నల్లని మచ్చలు తగ్గుతాయి.
  2. మొటిమలు తగ్గిపోయిన తరువాత కొంతమందికి చర్మం లోపలికి నొక్కుకుపోయి గుంటలు పడినట్లుగా కనపడుతుంది. అలాంటి వారు ఉడకబెట్టిన బంగాళదుంపను రాసుకోవడం వలన ఫలితం ఉంటుంది. ఇది చర్మాన్ని నిగారించేలా చేసి మచ్చలను సైతం తగ్గిస్తుంది. అలాగే కంటి కింద వలయాలను కూడా మాయం చేస్తుంది.
  3. గంధం మరియు రోజ్‌వాటర్‌ ని పేస్ట్‌లాగా కలిపి ముఖానికి రాసుకోవాలి. దీనిని రాసుకొని ఒక గంటపాటు ఆరనివ్వాలి. తరువాత చన్నీటితో కడిగేయాలి. గంధం చర్మాన్ని చల్లదనాన్ని ఇస్తుంది. ఇలా చేయడం వలన సున్నితమైన చర్మం కలిగిన వారు మంచి ఫలితాన్ని పొందుతారు.
  4. బేకింగ్‌ సోడా కూడా సౌందర్య చికిత్సలలో మంచి ఫలితాలను అందిస్తుంది. ఒక టేబుల్‌ స్పూన్‌ బేకింగ్‌ సోడాలో రెండు టేబుల్‌ స్పూన్‌ నీళ్ళు కలిపి బాగా కలపాలి. వచ్చిన మిశ్రమాన్ని ముఖం మీద మచ్చలు కలిగిన ప్రాంతంలో 2 నిమిషాల పాటు రుద్ధుకోవాలి. తరవాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి.
  5. ఆలివ్‌ఆయిల్‌ ఒక అద్బుతమనే చెప్పాలి.ఇది మచ్చలను తగ్గించడంలో ప్రధమపాత్ర వహిస్తుంది.ఇది వంగకాలలో వేసుకోవడం వల్ల మంచి రుచిని అందించడంతో పాటు ఆరోగ్యాన్ని మీ సోంతం చేస్తుంది. ఆలివ్‌ఆయిల్‌ని కొంచెం చేతిలోకితీసుకొని ముఖాన్ని మసాజ్‌ చేయాలి. ఈ విధంగా చేయడం వల్ల ముఖం మీద మచ్చలు,గుంటలు క్రమంగా తగ్గుతాయి.
  6. దోసకాయ రసం లేదా దోసకాయ పేస్ట్‌ని ముఖానికి మాస్క్‌ వేసుకోవడం వల్ల చర్మాన్ని మృదువుగా మారుస్తుంది. చాలా సౌందర్య సాధనాలలో దోసకాయ ముఖ్యపాత్ర వహిస్తుంది.
  7. ఐస్‌క్యూబ్స్‌ మచ్చలు, రంద్రాలు తగ్గించడంలో కీలక పాత్ర వహిస్తాయి. పలుచటి వస్త్రాన్ని తీసుకొని దానిలో ఐస్‌క్యూబ్‌ ని ఉంచి దాంతో ముఖం మీద 10 నుండి 15 నిమిషాలు మసాజ్‌ చేసుకోవాలి. ఇలా రోజుకి రెండు సార్లు చేసుకోవడం వలన మొటిమలు వల్ల కలిగిన మచ్చలు, నొప్పి మరియు హాల్స్‌ కూడా తగ్గుతాయి.
  8. టమాటాలో ఎక్కువ మొతాదులో విటమిన్‌ ఎ ఉంటుంది. ఇది వాడడం వల్ల పాడయిన చర్మాన్ని పునరుద్ధరిస్తుంది. టమాటా పేస్ట్‌ని ముఖానికి రాసుకుని కొంత సమయం గడిచిన తరువాత చల్లని నీటితో కడగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది
  9. అలోవెరా మంచి ఔషదవాహిని. ఇది చర్మానికి తగిలిన దెబ్బలని సైతం తగ్గించగలదు. మెడిసిన్‌ గుణాలు కలిగి ఉండడం చేత చర్మాన్ని ఆరోగ్యవంతంగా తీర్చిదిద్ధుతుంది. అలోవెరా జ్యూస్‌ని కొంచెం తీసుకొని ముఖానికి రాసుకోవాలి. ఇలా రోజు చేయడం వల్ల కాంతివంతమైన మచ్చలు లేని మృదువైన ముఖాన్ని పొందుతారు.

English summary

Reduce Acne scars naturally at home. Acne scar occur when someone’s pop your pimples and spots become inflamed. Follow these steps to get rid of acne scars.