నేను ప్రెగ్నెంట్ అంటూ అతన్ని బ్లాక్ మెయిల్ చేసిన రెజీనా

Regina blackmails shopkeeper

10:21 AM ON 1st July, 2016 By Mirchi Vilas

Regina blackmails shopkeeper

తమకు కావాల్సిన దాని ఎలాంటి అబద్దాలు చెప్పడానికైనా, ఎటువంటి మోసాలు చేయడానికైనా మనుషులు వెనుకాడని రోజులివి. సరిగ్గా ఇలాంటిదే హాట్ బ్యూటీ రెజీనా చేసిందట. ఆ వివరాల్లోకి వెళితే.. తనకు కావాల్సిన ఓ వస్తువు కోసం ఏకంగా తాను ప్రెగ్నెంట్ నంటూ ఓ వ్యక్తిని బ్లాక్ మెయిల్ చేసిందట. ఈ విషయాన్ని స్వయంగా రెజీనాయే చెప్పింది. ఇలాగే తాను చాలామందిని మోసం చేశానని, అలా చేయడం తనకెంతో ఇష్టమని అమ్మడు తెలిపింది. రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో మీకు ఇష్టమైన స్వీట్ ఏంటి? అని అడగగా.. మిష్టి దోయి అని చెప్పింది.

ఈ నేపథ్యంలోనే ఓ అనుభవం గురించి అమ్మడు బోల్డ్ గా షేర్ చేసుకుంది. ఓరోజు నాకు మిష్టి దోయి తినాలనిపించింది. అప్పటికే అర్థరాత్రి అయినా.. ఎలాగైనా తినాలని స్వీట్ షాప్ కి వెళ్ళాను. మిష్టిదోయి ఇవ్వమంటూ షాప్ కీపర్ ని అడిగాను. కానీ.. షాప్ మూసివేసే టైమ్ కావడంతో అతను ఇవ్వనన్నాడు. అప్పుడు నేను ప్రెగ్నెంట్ అని అబద్ధం చెప్పాను. అంతే.. అతను నా మాటలు నమ్మి, వెంటనే ఆ స్వీట్ ఇచ్చాడు. అలా సెంటిమెంట్ తో అతడ్ని బ్లాక్ మెయిల్ చేసి, నాకిష్టమైన స్వీట్ ని తిన్నాను అని రెజీనా చెప్పుకొచ్చింది. తాను చాలా బోల్డ్ గర్ల్ అని, పెద్ద ప్రాంక్ స్టర్ అని ఈ సెక్సీభామ చెప్పుకొచ్చింది.

ఇదిలా ఉంటే.. రెజీనా ప్రస్తుతం జో అచ్యుతానంద అనే చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వారాహి చలనచిత్రం పతాకం పై సాయి కొర్రపాటి నిర్మిస్తున్నారు. ఇందులో నాగశౌర్య, నారా రోహిత్ హీరోలుగా నటిస్తున్నారు. ఈ చిత్రంతో పాటు మరో రెండు తమిళ సినిమాలతోనూ రెజీనా బిజీగా ఉంది.

English summary

Regina blackmails shopkeeper