అపరిచిత బాయ్ ఫ్రెండ్ కి కటీఫ్

Regina breakup with her boyfriend

03:43 PM ON 16th July, 2016 By Mirchi Vilas

Regina breakup with her boyfriend

అలనాటి హీరోయిన్లులా కాకుండా ఇప్పటివాళ్ళు అలా వచ్చి ఇలా లవ్ ఎఫైర్ లలో పడిపోతున్నారు. ఇక పిల్లా నువ్వులేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ వంటి సినిమాలతో హిట్ కొట్టి లైమ్ లైట్ లోకి వచ్చేసిన రెజీనాది ఇంకా డిఫరెంట్ అంటున్నారు. నిప్పులేనిదే పొగ రాదని అంటారు కదా, అందుకే ఈ అమ్మడిపై ఒక్కసారిగా రకరకాల రూమర్లు చక్కర్లు కొట్టాయి. ఓ యంగ్ హీరోతో కలిసి ఈమె షికార్లు కొడుతోందని, ఆమె కాల్షీట్లు కూడా బాయ్ ఫ్రెండే చూస్తున్నాడంటూ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అయితే, ఎవరో కావాలని ఇదంతా చేస్తున్నారని, తమ మధ్య ఎటువంటి ఎఫైర్ లేదంటూ క్లారిటీ ఇచ్చేసింది కూడా.

ఇంతవరకు స్టోరీ బానే వుంది.. ప్రజెంట్ లోకి వస్తే రెజీనా, తన బాయ్ ఫ్రెండ్ ని వదిలేశానని చెప్పి షాక్ ఇచ్చింది. ఇన్నాళ్లూ బాయ్ ఫ్రెండ్ లేదని చెప్పుకొచ్చిన రెజీనా ఇప్పుడిలా జర్క్ ఇవ్వడంతో ఇంతకీ రెజీనా బాయ్ ఫ్రెండ్ ఎవరు? అన్నది తెరమీదికి వచ్చింది. అయితే ఈ విషయంలో ఆమె ఎలాంటి క్లూ ఇవ్వలేదు. దీంతో రకరకాలుగా చర్చించుకోవడం అభిమానుల వంతైంది. ఓల్డ్ ఫ్రెండ్ కి కటీఫ్ చెప్పిందా? లేక న్యూ బాయ్ ఫ్రెండ్ ఎవరైనా వున్నారా? అంటూ ఫిల్మ్ నగర్ లో ఒకటే సణుగుడు. ఇప్పటికే ఇంత చేసిందంటే, మున్ముందు ఇంకెంత చేస్తుందోనని సినీ లవర్స్ చెవులు కొరుక్కుంటున్నారు.

English summary

Regina breakup with her boyfriend