నందమూరి హీరోని అన్నా అని పిలిచినా రెజీనా!

Regina called Taraka Ratna was brother

03:00 PM ON 2nd May, 2016 By Mirchi Vilas

Regina called Taraka Ratna was brother

సినిమా పరిశ్రమలో ఎవరు ఎవరికి ఏమౌతారు అన్నది కాస్త కన్ ఫ్యూజన్ గానే ఉంటుంది. కాస్త క్లోజ్ గా ఉన్నంత మాత్రానా హీరో హీరోయిన్ మధ్య ఏవేవో జరుగుతున్నట్టు రాయడం మీడియా వారికి అలవాటే.. కాని డైరెక్ట్ గా ఓ ఇంటర్వ్యూలో నందమూరి హీరోని స్టార్ హీరోయిన్ అన్నా అని పిలిచి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఏ నందమూరి హీరోని.. ఏ స్టార్ హీరోయిన్ అన్నా అని పిలిచిందో తెలుసుకోవాలంటే వివారాల్లోకి వెళ్లాల్సిందే. నందమూరి అభిమానుల సపోర్ట్ తో నారా వారి కుటుంబం నుండి హీరోగా పర్వాలేదనిపించుకున్నాడు రోహిత్. సినిమాలైతే తీస్తున్నాడు కాని అవి హిట్ ట్రాక్ మాత్రం ఎక్కట్లేదు.

నెలకో సినిమా రిలీజ్ చేస్తున్న రోహిత్ తాజాగా 'రాజా చెయ్యి వేస్తే' అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇందులో విశేషం ఏంటంటే నందమూరి హీరో తారకరత్న విలన్ గా చేయడం. కొద్దికాలంగా సినిమాలేవి చేయని తారకరత్న రాజా చెయ్యి వేస్తేలో విలన్ గా చేయడం అందరిని షాక్ కు గురి చేసింది. అయితే ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా నారా రోహిత్ తర్వాత నటిస్తున్న 'జ్యో అచ్యుతానంద' హీరోయిన్ రెజీనాతో స్పెషల్ ఇంటర్వ్యూ ఏర్పాటు చేశాడు. ఆ ఇంటర్వ్యూలో రెజీనాతో తారకరత్న పాల్గొన్నాడు. సినిమాకు సంబంధించిన ప్రశ్నలను అడుగుతూ తారకరత్నను అన్నా అని పిలిచి అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది రెజీనా.

మరి తారకరత్నను ఆమె అన్నా అని పిలవడంలో ఉన్న కారణాలేంటో తెలియలేదు. మొత్తానికి స్టార్ హీరోయిన్ చేత అన్నా అని పిలిపించుకున్న క్రెడిట్ తారక రత్నకు దక్కింది.

English summary

Regina called Taraka Ratna was brother. Hot beauty Regina Cassandra called Nandamuri Taraka Ratna was brother.