పింక్ రిబ్బన్ వాక్ లో రెజీనా..(వీడియో)

Regina Cassandra at pink ribbon walk

03:01 PM ON 3rd October, 2016 By Mirchi Vilas

Regina Cassandra at pink ribbon walk

ఈమధ్య హీరోయిన్లు బిజినెస్ బ్రాండ్ అంబాసిడర్ లాగానే కాకుండా అవేర్ నెస్ ప్రోగ్రామ్ లలో కూడా పాగొంటున్నారా? అవునో కాదో గానీ రొమ్ము క్యాన్సర్ నివారణపై ఆదివారం హైదరాబాద్ కెబీఆర్ పార్క్ లో జరిగిన కార్యక్రమంలో హీరోయిన్ రెజీనా పాల్గొంది. మహిళల్లో రొమ్ము క్యాన్సర్ నివారణపై అవగాహన పెరగాలని రెజీనా అంటోంది. టీనేజీ యువతులకు కూడా ఈ వ్యాధి సోకవచ్చునని, అందువల్ల మొదటి దశలోనే దీనిని గుర్తించి నివారించాలని సూచించింది. ఇలాంటి అవేర్ నెస్ కార్యక్రమాలు మరిన్ని చేపట్టాలని ఆమె నిర్వాహకులను కోరింది. ఇందులో నగరానికి చెందిన డాక్టర్లు కూడా పాల్గొన్నారు. ప్రతి ఏటా అక్టోబరు మొదటి ఆదివారం తాము ఇలాంటి అవేర్ నెస్ ప్రోగ్రామ్స్ చేపడుతుంటామని నిర్వాహకులు తెలిపారు.

English summary

Regina Cassandra at pink ribbon walk