ఆ కమెడియన్ తో జోడి కడుతున్న రెజీనా!

Regina Cassandra pairing with comedian

03:55 PM ON 10th August, 2016 By Mirchi Vilas

Regina Cassandra pairing with comedian

తెలుగులో క్రేజీ హీరోయిన్ తో పాటు, లిప్ లాక్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న హాట్ భామ రెజీనాకు, ఈ మధ్య కాస్త బ్రేక్ పడింది. వరుస పరాజయాలతో కెరీర్ వెనకపడింది, ప్రస్తుతం తెలుగులో సినిమాలు తగ్గిపోవడంతో... ఇప్పుడు తమిళంలో గట్టిగానే ప్రయత్నాలు సాగిస్తున్న ఈ భామకు ఓ మంచి ఛాన్స్ దక్కింది. అయితే తమిళంలో హీరోయిన్ గా ఛాన్స్ దక్కింది కమెడియన్ సరసన కావడం విశేషం. ఆ వివరాల్లోకి వెళితే.. తమిళ కమెడియన్ సంతానం హీరోగా సెల్వ రాఘవన్ దర్శకత్వంలో రూపొందే హర్రర్ ఎంటర్టైనర్ లో రెజీనా హీరోయిన్ గా ఎంపికయింది.

ఇప్పటికే ఇందులో ఇద్దరు హీరోయిన్స్ ఉంటారట, మరో హీరోయిన్ గా నందిత శ్వేతాను ఎంపిక చేసారు. వచ్చే నెలలో సెట్స్ పైకి రానున్న ఈ సినిమాతో తమిళంలో ఎలాంటి క్రేజ్ దక్కించుకుంటుందో చూడాలి మరి. ఇందులో కూడా రెజీనా లిప్ లాక్ సీన్స్ లో నటిస్తుందా అని కామెంట్స్ పెట్టేస్తున్నారు.

English summary

Regina Cassandra pairing with comedian