నేను చేసిన ఆ ఫోటోలు బయటకు వచ్చాయో ఇక అంతే: రెజీనా

Regina Cassandra talks about her hot photoshoot and affair

06:38 PM ON 26th August, 2016 By Mirchi Vilas

Regina Cassandra talks about her hot photoshoot and affair

'ఎస్ఎంఎస్' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ముద్దుగుమ్మ రెజీనా. ఆ తరువాత రొటీన్ లవ్ స్టోరీ, కొత్త జంట, రారా కృష్ణయ్య, పవర్, పిల్లా నువ్వు లేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, సౌఖ్యం, శౌర్య వంటి చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది. ఈ అమ్మడు ఇప్పుడు టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ ప్రాజెక్ట్స్ తో కూడా బిజీగా ఉంది. ప్రస్తుతం జ్యోఅచ్యుతానంద సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా రెజీనా మాట్లాడుతూ.. శ్రీనివాస్ అవసరాల నాకు కథ చెప్పారు. నేను ఆలోచిస్తుండగా రోహిత్ నన్ను కలిసి ఈ కథ నువ్వు చేస్తే బావుంటుంది.. మిస్ చేయకు అని చెప్పారు.

అందుకే సరే అన్నాను. నేనొక డెంటిస్ట్ పాత్రలో కనిపిస్తాను. ఇప్పటివరకు ఇంత ఫన్ ఉన్న క్యారెక్టర్ లో నేను నటించలేదు అని అన్నారు. ప్రస్తుతం మీకు బాలీవుడ్ లో అవకాశం వచ్చింది కదా మీరు ఎలా ఫీలవుతున్నారు? అని అడగగా.. చాలా సంతోషంగా ఉంది. మొదట నేను నా ఫోటోస్ పంపించాను. నచ్చి పిలిపించారు. మూడు, నాలుగు రోజుల్లోనే ప్రాసెస్ మొత్తం పూర్తి చేసి నన్ను సెలెక్ట్ చేశారు. ఆ సినిమా కోసం ఓ ఫోటోషూట్ చేశారు. అది గనుక బయటకొస్తే.. అని నవ్వేశారు. అంటే? అని ప్రశ్నించగా బాలీవుడ్ లో హాట్ గానే కనిపించాలి కదా దానికి తగ్గట్లు ఆ ఫోటోషూట్ ఉంది అన్నారు.

ఈ మధ్య హీరో సాయిధరమ్ తేజ్ తో ఎఫైర్ ఉంది అని ఒక వార్త హల్ చల్ చేస్తోంది. దాని గురించి చెప్పమంటే అసలు ఎఫైర్ ఉందని ఎవరు చెప్పారు. ఎవరికి నచ్చినట్లు వాళ్ళు రాసుకుంటున్నారు. మా మధ్య ఎలాంటి ఎఫైర్ లేదు. అని చెప్పుకొచ్చింది.

ఇది కూడా చదవండి: డౌట్ వచ్చి టాయిలెట్ లోకి వెళ్లి ఫోన్ లో వీడియో తీసుకుంది.. కానీ..(వీడియో)

ఇది కూడా చదవండి: 2050కల్లా భూమిపై ఎంత మంది ఉంటారో తెలుసా?

ఇది కూడా చదవండి: '100 డేస్ ఆఫ్ లవ్' మూవీ రివ్యూ అండ్ రేటింగ్

English summary

Regina Cassandra talks about her hot photoshoot and affair.