ఈ సినిమాను నా మనవళ్లను కూడా చూడమంటా!

Regina Cassandra talks about Jyo Achyutananda movie

12:28 PM ON 27th August, 2016 By Mirchi Vilas

Regina Cassandra talks about Jyo Achyutananda movie

ఇదేమిటి, ఈ ముద్దుగుమ్మకు ఇంకా పెళ్లి కాలేదు అప్పుడే మనవలు ఏమిటి అనుకుంటున్నారా? అయితే వివరాల్లోకి వెళ్లాల్సిందే.. ప్రస్తుతం హిందీ చిత్రం 'ఆంఖే -2' లో నటిస్తున్న రెజీనా, అమితాబ్ తో పాటు భారీ తారాగణం ఈ చిత్రంలో ఉంటుందని చెప్పింది. ఈ మధ్యే ఫోటోషూట్ జరిగిందని, ఇప్పటివరకూ అలాంటి భారీ ఫొటోషూట్ లో నేను పాల్గొనలేదని ఆమె చెప్పుకొచ్చింది. ఇది కాకుండా తమిళంలో రెండు సినిమాలు చేస్తున్నాను. తెలుగులో 'జ్యో అచ్యుతానంద'తో పాటు 'శంకర' కూడా ఒకే నెలలో విడుదలవుతాయి అని రెజీనా తెలిపింది. ఇక 'జ్యో అచ్యుతానంద' సినిమాలో నటించిన ఈ భామకు ఈ సినిమా బాగా నచ్చేసిందట. 'జ్యో అచ్యుతానంద'లో నేను డెంటల్ డాక్టర్ పాత్ర పోషించా. పక్కింటి అమ్మాయిలా ఉంటా.

ఈ సినిమాలో నన్ను చూసినవాళ్లు నవ్వుతారు.. బాధపడతారు.. ఇష్టపడతారు.. అసహ్యించుకుంటారు కూడా. ఇంత మంచి పాత్ర చేసే అవకాశం రావడం నా అదృష్టం. ఇందుకు అవసరాల శ్రీనివాస్.. సాయి కొర్రపాటిలకు కృతజ్ఞతలు. నాకు 90 ఏళ్లు వచ్చినా కూడా నేనీ సినిమాను మర్చిపోను. నా మనవలు.. మనవరాళ్లకు కూడా ఈ సినిమా చూడమని చెబుతా. అంతగా నా మనసుకు దగ్గరయిందీ సినిమా. ఈ కథ విన్నప్పట్నుంచి ఎప్పుడెప్పుడు షూటింగ్ ఆరంభమవుతుందా అని ఎదురు చూశా. ఇప్పుడు సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ఎదురు చూస్తున్నా అని రెజీనా చెప్పిందండి. ఇప్పుడు అర్థమైందా..

ఇది కూడా చదవండి: అయ్యో సన్నీ లియోన్ కి ఏమైంది(వీడియో)

ఇది కూడా చదవండి: టీచర్ చెంప చెల్లుమనిపించాడు.. ఆపై...

ఇది కూడా చదవండి: ప్రిన్స్ కోసం ఆ స్టార్ హీరోకి నో చెప్పేసింది...

English summary

Regina Cassandra talks about Jyo Achyutananda movie.