103 అంతస్తులో ఆ హీరోయిన్‌ ఏం చేసిందో తెలుసా ?

Regina does push-ups in 103rd floor

01:47 PM ON 21st March, 2016 By Mirchi Vilas

Regina does push-ups in 103rd floor

ఆకాశ సౌదంలో 103 అంతస్తులో ఉంటే మీరేం చేస్తారు ? అక్కడి నుండి వ్యూ చూస్తూ ఆనందిస్తారు లేదా అంత ఎత్తు నుండి చూడడానికి భయపడతారు. కానీ ఈ హీరోయిన్‌ రూట్‌ సెపరేటు అంట. 103 అంతస్తులో ఆ హీరోయిన్‌ ఏం చేసిందో తెలుసా ? తీరిగ్గా పుష్ అప్స్ తీసిందట. ఇంతకీ ఎవరా హీరోయిన్‌ అనేకదా ? ఇంకెవరు ఇటీవల తెలుగు చిత్రాలలో ఒక వెలుగు వెలుగుతున్న నటి రెజీనా.

ఇటీవల షికాగోలోని అత్యంత ఎతైన 'స్కైడెక్‌ షికాగో’ ను ఆమె సందర్శించింది. ఇందులో చివరి ప్లోర్‌కు వెళ్లి అక్కడ సందడి చేసింది ఈ భామ. కాలి కింద నుంచి అద్దంలోకి కనబడుతున్న భవంతులను చూసేందుకు సరదాగా పుష్‌అప్స్‌ తీసింది. దగ్గరగా చూసేందుకు ఇలా చేసిందట. 103 లో పుష్‌అప్స్‌ చేస్తున్న పోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. అంతేకాదు అందరికీ మెసేజ్‌ కూడా ట్వీట్‌ చేసింది రెజీనా. స్కైడెక్‌ షికాగో కు వెళ్ళి ఏరియల్‌ వ్యూతో సరిపెట్టుకోకుండా తనలాగే పుష్‌అప్స్‌ చేయమని సలహా ఇచ్చింది. అలాగే పోటో తీసుకోవడం మరిచిపోవద్దని ట్వీట్‌ చేసింది.

సర్దార్ వేడుకలో హైలెట్స్ ....

కోపం వద్దు, ఫస్ట్‌ వినండి.... నాగ్‌తో ఎన్టీఆర్‌

ఎందుకు నవ్వుతున్నావ్... టీవీ యాంకర్ ఫై షోయబ్ ఆగ్రహం

English summary

Regina Cassandra is on the 103rd floor, she does push-ups. She posted photos in social media.