తన రెండు కళ్ళను దానం చేసిన రెజీనా!

Regina donates eyes

04:58 PM ON 10th August, 2016 By Mirchi Vilas

Regina donates eyes

టాలీవుడ్ లిప్ లాక్స్ బ్యూటీ రెజీనా కెరీర్ ఇప్పుడు బాగానే ఉంది కానీ.. గొప్పగా మాత్రం లేదు. చేతిలో సినిమాలు చాలానే ఉన్నా.. క్రేజ్ ఉన్నా సినిమా మాత్రం లేదు. కృష్ణవంశీతో చేస్తున్న నక్షత్రం ఒక్కటే.. పెద్ద డైరెక్టర్ తో చేస్తున్న సినిమా. తోటి పోటీ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ దూసుకుపోతుంటే ఆ వేగాన్ని అందుకోలేకపోతున్న రెజీనా.. ఓ విషయంలో మాత్రం సీనియర్ హీరోయిన్లను ఫాలో అయిపోతోంది. రీసెంట్ గా నెల్లూరులో ఓ కంటి ఆస్పత్రి ప్రారంభానికి అటెండ్ అయింది రెజీనా. ఆ కార్యక్రమంలోనే.. తన రెండు కళ్లను దానం చేస్తున్నట్లు ఆస్పత్రి వర్గాలకు సైన్ చేసి ఇచ్చేసింది.

అవి దానం చేయాలి.. ఇవి దానం చేయడం అని చెప్పడమే కాకుండా.. పిలవగానే తనే స్వయంగా వచ్చి తనే డొనేట్ చేయడాన్ని గుర్తుంచుకోవాలి. అంతే కాదు ఆ ఆస్పత్రి మొత్తం తిరిగేసి.. అక్కడి పరిస్థితుల గురించి తెలిసేసుకుంది కూడా. ఇప్పటికే కాజల్.. సమంతలు కూడా తమ నేత్రాలను దానం చేశారు. ఇప్పుడు రెజీనా కూడా ఈ రూట్ లో జాయిన్ అయిపోయింది. మంచితనం బాగానే ఉంది కానీ.. సినిమాల్లో సత్తా చాటేందుకు అవసమరైన అందం.. ట్యాలెంట్. ఆకర్షణ అన్నీ ఉన్నా రెజీనా కసాండ్రాకి ఆఫర్స్ అంతగా రాకపోవడం ఆలోచించాల్సిన విషయమే కదూ.

English summary

Regina donates eyes