వామ్మో ఆ పాత్రకు సై అన్న రెజీనా!

Regina is acting as a ghost

06:59 PM ON 22nd June, 2016 By Mirchi Vilas

Regina is acting as a ghost

'కేడీబిల్లా కిలాడిరంగా' చిత్రంతో కోలీవుడ్ కు పరిచయం అయిన నటి రెజీనా. ఆ చిత్రం విజయం సాధించినా ఆ తరువాత ఈ హాట్ బ్యూటీకి ఇక్కడ అంతగా అవకాశాలు రాలేదు. దానికి కారణం అందాలారబోతకు తాను రెడీగా లేనంటూ వ్యాఖ్యలు చెయ్యడమే. సహ నటీమణులు అందాల ఆరబోతతో దుమ్మురేపుతుంటే తాను కుటుంబ కథాపాత్రలనే చేస్తానన్న రెజీనాను కోలీవుడ్ దూరంగా పెట్టింది. దీంతో ఈ భామ టాలీవుడ్ పై దృష్టి పెట్టింది. అక్కడ కూడా అనుకున్నట్లుగా అవకాశాలు రాలేదు. దీంతో తన హద్దులను చెరిపేయడానికి సిద్ధపడి సొంతంగా ఫొటో సెషన్ ను ఏర్పాటు చేసుకుని హాట్ హాట్ ఫొటోలను వెబ్ సైట్ లో పెట్టి గ్లామర్ పాత్రలకు సై అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

అయితే అలాంటి గ్లామరస్ ఫొటోలు పబ్లిసిటీకి పనికొచ్చాయి గానీ అవకాశాలను మాత్రం తెచ్చిపెట్టలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఎట్టకేలకు ఒక అవకాశాన్ని కోలీవుడ్ లో రెజీనా రాబట్టుకుంది. అదీ సంచలన దర్శకుడు సెల్వ రాఘవన్ దర్శకత్వంలో నటించే అవకాశం రావడంలో చాలా ఖుషీ అయిపోయింది. ఈ చిత్రంతో మరోసారి తన అదృష్టాన్ని కోలీవుడ్ లో పరిక్షించుకోవచ్చని భావించింది. సెల్వ రాఘవన్ చిన్న గ్యాప్ తరువాత దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'నెంజమ్ మరప్పదిల్లై'. ఎస్.జే. సూర్య కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో రెజీనా, నందిత కధానాయికలుగా నటిస్తున్నారు.

అయితే ఆ చిత్రంలో అందాలను ఆరబోసి మరిన్ని అవకాశాలను రాబట్టుకోవాలని ఆశపడిన రెజీనాకు ఆ అవకాశం లేకపోయిందట. కారణం ఇందులో ఆమెను సెల్వరాఘవన్ దెయ్యంగా చూపించడమే. ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందిస్తున్నారు. దీంతోనైనా రెజీనాకి అవకాశాలు వస్తాయేమో చూడాలి.

English summary

Regina is acting as a ghost