పాపం మజ్నులో ఇషా శర్మ ని తీసేసి ఆమెను పెట్టారు

Regina replaced Isha Sharma against Naga Chaitanya

06:28 PM ON 7th December, 2015 By Mirchi Vilas

Regina replaced Isha Sharma against Naga Chaitanya

నాగచైతన్య తాజాగా నటిస్తున్న చిత్రం 'మజ్ను'. ఇది తమిళంలో సూపర్‌ హిట్తైన 'ప్రేమమ్‌'కి రీమేక్‌. 'కార్తికేయ' ఫేమ్‌ చందు మొండేటి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో నాగచైతన్య మూడు ఏజ్‌ గ్రూపులలో కనిపించనున్నాడు. అందుకోసం ఒక్కొక్క ఏజ్‌ గ్రూప్‌కి ఒక్కొక్క హీరోయిన్‌ని ఎంపిక చేశారు. శృతిహాసన్‌, అనుపమ పరమేశ్వరన్‌ మరియు ఐషాశర్మ అయితే తాజా సమాచారం ప్రకారం ఐషాశర్మ స్థానంలో రెజీనా కాసెండ్రాని ఎంపిక చేసుకున్నారు. ఎందుకంటే ఐషాశర్మ నాగచైతన్యకి మరీ యంగ్‌గా కనిపిస్తుండడంతో ఈ మార్పుని చేశారు.

ఎస్‌. నాగ వంశీ నిర్మిస్తున్న ఈ చిత్రంలో వెంకటేష్‌, నాగార్జున గెస్ట్‌ రోల్స్‌ చేస్తున్నారు. 2016 వేసవి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు.

English summary

Regina replaced Isha Sharma against Naga Chaitanya in Majnu movie.