కృష్ణవంశీ సినిమాలో బికినీ వేస్తుందట!

Regina wearing bikini in Krishna Vamsi movie

12:11 PM ON 4th June, 2016 By Mirchi Vilas

Regina wearing bikini in Krishna Vamsi movie

'ఎస్ఎంఎస్' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమై ఆ తరువాత రొటీన్ లవ్ స్టొరీ, కొత్త జంట, రారా కృష్ణయ్య వంటి చిత్రాల్లో నటించిన రెజీనా సందీప్ కిషన్ తో నటించిన రారా కృష్ణయ్య చిత్రంలో మాత్రం విపరీతంగా అందాలు ఆరబోసింది. ఇందులో లిప్ లాక్ సన్నివేశాలు, విపరీతమైన అందాలు ఆరబోతతో వెండితెరని వేడెక్కించింది. ఆ తరువాత పవర్, పిల్లా నువ్వులేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, సౌఖ్యం, శౌర్య వంటి చిత్రాల్లో నటించింది. అయితే వరుసపెట్టి ఫ్లాప్ లు రావడంతో ఈ అమ్మడుకి అవకాశాలు ఇచ్చే వాళ్ళు కరువయ్యారు.

దీంతో మళ్లీ అందాలు ఆరబోత డోస్ పెంచాలని ఫిక్స్ అయిందట రెజీనా. ఒక్క ప్రక్కన ఇతర హీరోయిన్లు పుంజుకోవడం.. ఈమెకు మాత్రం ఆఫర్లు రాకపోవడం.. వగైరా వగైరా అంశాలతో విసుగెత్తిపోయి మరోసారి గ్లామర్ టచ్ ఇవ్వాలని డిసైడైనట్లు ఉంది. త్వరలోనే కృష్ణవంశీ డైరక్షన్ లో 'నక్షత్రం' సినిమాలో సందీప్ కిషన్ సరసన నటిస్తున్న రెజీనా.. ఈ సినిమాలో ఏకంగా బికినీ కూడా వేసుకోనుందట. అయితే టూ పీస్ బికినీలో మత్తెక్కిస్తుందా.. లేకపోతే సింగిల్ పీస్ బికినీలో పిచ్చెక్కిస్తుందో తెలియదు కానీ.. బికినీ మాత్రం కన్ఫామ్ అంటున్నారు ఈ చిత్ర యూనిట్.

అయితే ఇలా మరోసారి సందీప్ కిషన్ సినిమాలోనే ఈ హాట్నెస్ అంతా చూపించబోతుండటంతో.. ఇక అవకాశాలు వచ్చి పడతాయేమో అని రెజీనా భావిస్తుందట.

English summary

Regina wearing bikini in Krishna Vamsi movie