అమరనాధ్ యాత్రకు రిజిస్ట్రేషన్ ప్రారంభం

Registration Process Started For Amarnath Tour

04:41 PM ON 29th February, 2016 By Mirchi Vilas

Registration Process Started For Amarnath Tour

పరమ పవిత్రమైన అమరనాథ్‌ యాత్రకు సోమవారం నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభం చేస్తున్నారు. రెండు మార్గాల్లో 48 రోజుల పాటు సాగే ఈ యాత్ర జులై 2న ప్రారంభమై, ఆగస్టు 18న రాఖీపౌర్ణమి నాడు ముగస్తుంది. ఈ సందర్భంగా శ్రీ అమర్‌నాథ్‌జీ బోర్డు సీఈవో పీకే త్రిపాఠి మాట్లాడుతూ.. రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ వివరాలను ఆలయ వెబ్‌సైట్‌లో ఉంచామని వివరించారు. రిజిస్ట్రేషన్‌ చేసుకునే యాత్రికులు ఆయా రాష్ట్రల ప్రభుత్వాలు గుర్తించిన ఆరోగ్య ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుందని ఆయన స్పష్టంచేశారు. అమరనాధ్ యాత్రకు ఓ విశిష్ట గుర్తింపు వుంది. ఏటా ఈ యాత్రలో పాల్గొనే యాత్రికులు ప్రభుత్వం సూచించిన సూచనలు తప్పనిసరిగా పాటించాల్సి వుంటుంది.

English summary

The Registration Process for Amarnath Tour was started.This tour starts from July 2nd and Ends on August 18th.This was said by Amarnathji Board Temple CEO P.K.Tripati.He says that every pilgrim should have to submit Health certificate which issued by their State government.