ఓటుకు నోటు కేసు మళ్ళీ మొదలైంది

ReInvestigation In cash For Vote Case

10:54 AM ON 1st September, 2016 By Mirchi Vilas

ReInvestigation In cash For Vote Case

ఆమధ్య ఓ కుదుపు కుదిపేసి , రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా చేసిన కేసు మళ్ళీ మొదలైంది. అదేనండీ ఎపి, తెలంగాణ లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు. ఇప్పుడు మరోసారి తెరమీదికొచ్చింది. వచ్చేనెల 29లోపు చంద్రబాబుపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఎసిబిని కోర్టు ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించి ఎసిబి అధికారులు తాజాగా కోర్టులో మెమో దాఖలు చేశారు. ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబుపై విచారణ జరుపుతామన్న ఎసిబి, దీనికి కొత్త ఎఫ్ ఐఆర్ అవసరంలేదని, పాత ఎఫ్ ఐఆర్ ద్వారానే విచారణ జరుపుతామని మెమోలో పేర్కొంది.

ఎసిబి చార్జిషీట్ ను పరిగణనలోకి తీసుకున్న కోర్టు, వచ్చే నెల 29న కోర్టు ఎదుట హాజరుకావాలని రేవంత్ రెడ్డి, సెబాస్టియన్లకు సమన్లు జారీ చేసింది. కాగా, చంద్రబాబు పాత్రపై దర్యాప్తు చేస్తున్నామని వచ్చే నెల 29లోపు విచారణ పూర్తి చేసి నివేదిక ఇస్తామని కోర్టుకు ఎసిబి విన్నవించింది. ఎసిబి కోర్టు తాజా ఉత్తర్వులతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఓటుకు నోటు కేసు మళ్లీ హాట్ టాపిక్ అయింది. కేసులో రాజీ పడ్డారని, ఇందుకోసం కోట్ల రూపాయలు చేతులు రకరకాల ఆరోణలు గుప్పుమంటున్నాయి. ఏం జరుగుతుందో వేచి చూడాలి.

ఇది కూడా చూడండి: బ్రహ్మంగారి కాలజ్ఞానం లో ఇప్పటివరకు ఎన్ని నిజమయ్యాయో మీరే చూడండి

ఇది కూడా చూడండి: ఈ ఈ రాసుల వాళ్ళు వివాహం చేసుకోకూడదట

ఇది కూడా చూడండి: టాలీవుడ్ హీరో ల పారితోషికాలు!!

English summary

Court orders to ACB ReInvestigation In cash For Vote Case.