రిలయన్స్ జియో వరల్డ్ రికార్డ్..

Relaince Jio world record

11:28 AM ON 10th October, 2016 By Mirchi Vilas

Relaince Jio world record

మొబైల్ రంగంలో తనదైన శైలిలో దూసుకెళ్తున్న రిలయన్స్ తాజాగా ప్రవేశ పెట్టిన జియో ప్రపంచ రికార్డు సృష్టించింది. జియో సేవలు ప్రారంభమైన ఒక్క నెలలోనే ఏకంగా 1.60కోట్ల వినియోగదారులను సొంతం చేసుకుంది. తద్వారా అత్యంత వేగవంతంగా ఎక్కువమంది వినియోగదారులను చేర్చుకున్న సంస్థగా అవతరించినట్టు రిలయన్స్ పేర్కొంది. సెప్టెంబరులో 4జీ మార్కెట్లోకి అడుగుపెట్టిన రిలయన్స్ జియో సంచలన ఆఫర్లతో ఇతర నెట్ వర్క్ సంస్థల గుండెల్లో గుబులు పుట్టించిన సంగతి తెలిసిందే. కాగా సామాజిక మాధ్యమాలైన ఫేస్ బుక్, వాట్సాప్, స్కైప్ వినియోగదారుల కన్నా కూడా ఈ సంఖ్య ఎక్కువని సంస్థ తెలిపింది.

వినియోగదారుల నుంచి జియోకు లభించిన అపూర్వ ఆదరణతో ఆనందం వ్యక్తం చేస్తున్నట్టు రిలయన్స్ సంస్థల చైర్మన్ ముకేశ్ అంబానీ ప్రకటించారు.

English summary

Relaince Jio world record