భార్యాభర్తల్లో ఎవరు గొప్ప?

Relation between wife and husband

12:35 PM ON 24th February, 2016 By Mirchi Vilas

Relation between wife and husband

భార్య భర్తల్లో ఎవరుగొప్ప ? ఈ ప్రశ్న పై జరిగినన్ని చర్చలు మరే విషయంపై జరిగి ఉండవు. ఒకప్పుడు నువ్వు గొప్ప అంటే నువ్వు గొప్ప అనుకునేవారు. ఇప్పుడు మన సంస్కృతి మారింది. అప్పట్లో భార్య భర్తలు అన్యోన్యంగా ఉంటూ మరియాదని ఇచ్చిపుచ్చుకునే వారు. ఇప్పుడంతా మారిపోయింది. పాశ్చాత్య సంస్కృతి ప్రపంచమంతా పాకేసింది. దీంతో సంసారాల్లో గొడవలు, విడాకులు లేదా కౌన్సిలింగులు ఇలా గొడవలతోనే సంసారాలు సాగుతున్నాయి.

ఆడపిల్లలు బాగా చదువుకుని పెద్దపెద్ద ఉద్యోగాలు చేస్తుండడంతో వారికి మంచి చెడ్డ తెలుసుకునే విజ్ఞానం ఏర్పడింది. దీంతో నేనుగొప్ప అంటే నేనుగొప్ప అనుకునే సంస్కృతి వచ్చేసింది. కాని మన సంస్కృతి మలాల్లోకి వెళితే సమాజంలో ఎదుర్కొనే అనేక సమస్యలకు చక్కగా పరిష్కార మార్గాలు చూపించారు. భార్యాభర్తల బంధానికి చక్కని నిదర్శనం సీతారాములు. వీరు వనవాసంలో ఉండగా ఒక సంఘటనే దీనికి నిదర్శనం. ఆ సంఘటనని వాల్మీకి తన రామాయణంలో ఎంతో గొప్పగా వర్ణించాడు. మన ఆధ్యాత్మికతలో ఉన్న అందమదే మరి. జీవితంలో గొప్ప సూత్రాలెన్నింటినో మధురంగా చెప్పారు. అలాంటిదే ఈ ఉదాహరణ…

సీతారాములు అరణ్యానికి వెళ్ళిన విషయం తెలిసిందే. అరణ్యంలో ఒక చోట ఒకపెద్ద చెట్టు ఉంది. ఆ చెట్టుకు అందమైన పూలతీగ అల్లుకుని వుందట, ఆ పూలు అందంగా, పెద్దగా, సువాసనా భరితంగా ఆ చెట్టు నిండా అల్లుకుని ఉన్నాయట. అది చూసిన రాముడు సీతతో ఇలా అన్నారట. 'సీతా, ఎంత పెద్ద చెట్టు అయినా, ఆ తీగ అలా అల్లుకోకపోతే, దానికి అందమెక్కడిది ? సువాసన ఎక్కడిది ? ఎవరు చూస్తారు దాన్ని ?’ అని అన్నారట. అందుకు బదులుగా సీతాదేవి ఇలా బదులిచ్చారట. ‘కానీ .. రామా, ఆతీగ ఆచెట్టు ను అలా అల్లుకోకపోతే, అది నేలమీద పడి పశువులచేత అణగదొక్కబడి ఎప్పుడో చనిపోయి ఉండేది కదా... ఆచెట్టు లేకపోతే తీగ లేనే లేదు’అని అన్నారట. ఇలా సీతా రాముల వివాదానికి లక్ష్మణున్ని మధ్యవర్తిత్వానికి పిలిచి చెట్టుగొప్పా, తీగగొప్పా? అని లక్ష్మణున్ని అడిగారు.

దానికి లక్ష్మణుడు తెలివిగా ఆలోచించి, కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం మనకెందుకు అని తెలివిగా బదులిచ్చాడంట... ‘ఆచెట్టు అలా పెరిగి, ఆ తీగ అలా అల్లుకోకపోతే, నేను ఆ చెట్టు నీడ కింద ఎలాసేద తీరుతాను, ఆ సువాసనలను ఎలా ఆస్వాదిస్తాను.. ఆరెండు అలా ఉంటేనే అందం. మాలాంటి వారికి ఆనందం’ అని బదులిచ్చాడంట. ఎంత అందంగా నువ్వుగొప్ప, నువ్వుగొప్ప అని వాదించుకున్నారో గమనించారా అదే సీతారాముల జంట అంటే.

English summary

There is a joining in relationships because God had declared, "It is not good for the man to be alone make him a helper suitable for him" It is an emotional bond between two individuals.