దారుణం: ఆ దేశం మొత్తం కూతురు వరస వాళ్లపై అత్యాచారం

Relatives in Guatemala doing rapes with their children

12:07 PM ON 2nd April, 2016 By Mirchi Vilas

Relatives in Guatemala doing rapes with their children

అక్కడ పరిస్థితి వేరు... అదో వింత ప్రపంచం... కాదు అదో అత్యాచారాల రాజ్యం... లేకపోతే తల్లిదండ్రుల ఒడిలో హాయిగా ఒదిగిపోవాల్సిన వయస్సులో పిల్లలే తల్లులుగా మారిపోతున్నారు. జీవితమంటే కూడా తెలియని ముక్కు పచ్చలారని చిన్నారులు... శారీరక, మానసిక హింసలకు గురవుతూ అయోమయంలో బతుకుతున్నారు. వివక్ష, అజ్ఞానం, పేదరికం వారి బతుకుల పాలిట శాపాలుగా మారుతున్నాయి. కుటుంబానికి బంధువులై, వరసకు తండ్రిలాంటి వారే పసికూనల పై అత్యాచారాలకు పాల్పడుతుండడం ఇక్కడి అజ్ఞానపు చీకటికి ప్రత్యక్ష తార్కాణం.

అమెరికా పక్కనే ఉన్న గ్వాటెమాలలోని అమ్మాయిల బతుకులను ఓ ఫోటో జర్నలిస్టు గ్వాటెమాలలోని తొమ్మిది మంది బాలికల జీవితాల్ని, వివక్ష తీరు, శారీరక, మానసిక దాడులను రచనా రూపంలో వెలుగులోకి తెచ్చారు. ఈ కథనంతో వెలుగులోకి తేవడంతో ఈ ఘటన యావత్తు ప్రపంచాన్నే కదిలిస్తోంది.... వణికిస్తోంది... భయం గల్గుతుంది... జుగుప్స కలిగిస్తోంది. దీనికి సంబంధించి వివరాల్లోకి వెళ్తే... దక్షిణ మెక్సికోలోని గ్వాటెమాలలో మొత్తం జనాభా 15 మిలియన్స్(కోటి యాభై లక్షలు). లాటిన్‌ అమెరికాలో అత్యధికం. అయితే అక్కడ 2014లోనే 10 నుండి 14 ఏళ్లలోపు 5100 మంది అమ్మాయిలు గర్భవతులని తేలింది. పైగా వారంతా అత్యాచారాలకు గురైనవారే నట.

2010-12 సంవత్సరం కంటే ఈ సంఖ్య 25 శాతం ఎక్కువని, ఇది పెరిగే అవకాశముందని యునైటెడ్‌ పాపులేషన్‌ ఫండ్‌ (యుఎన్‌ఎఫ్‌పిఎ) తెలిపింది. గ్వాటెమాలలో కౌమార దశలో ఉన్న యువతుల్లో యేటా 25 లక్షల అబార్షన్లు జరుగుతున్నట్లు వెల్లడించింది. ఓ నివేదిక ప్రకారం 89 శాతం మంది అమ్మాయిలు, బంధువుల చేతిలోనే అత్యాచారాలకు గురవుతున్నట్లు వెల్లడైంది. ఇక తల్లిదండ్రుల సమ్మతితోనే 14 ఏళ్లకే బాలికలకు పెళ్లిళ్లు చేసేస్తున్నారు. చాలామంది యువతులు బలవంతపు పెళ్లిళ్లకు తప్పనిసరి పరిస్థితుల్లో అంగీకరిస్తున్నారు. 18 ఏళ్లలోపు బాలికల కంటే సుమారు 30 శాతం మంది యువతులు 20 నుండి 24 ఏళ్లలోపు పెళ్లిళ్లు చేసుకుంటున్నట్లు వెల్లడైంది.

15 ఏళ్లలోపు పెళ్లిళ్లు చేసుకుంటున్న వారు 7 శాతంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో కొన్నేళ్లుగా అధ్యయనం చేస్తున్న ఓ మహిళా జర్నలిస్ట్ వివరాలను బహిర్గతం చేసింది. 

మిగతా వివరాలు కింద స్లైడ్ షోలో చూడండి:

1/11 Pages

11 ఏళ్లకే పెళ్లి:


ఒకప్పుడు అన్ని చోట్లా చిన్నప్పుడే పెళ్ళిళ్ళు చేసేసేవారు. కొన్ని చోట్ల సంస్కరణల వలన దీనికి అడ్డుకట్ట పడింది. అయితే గ్వాటెమాలలో ఇంకా అనాచారం కొనసాగుతోంది. అలీసియా అనే అమ్మాయికి 11 ఏళ్లకే పెళ్లి చేశారు. అత్తారింటికి తీసుకెళ్లిన అనంతరం 22 ఏళ్ల తన భర్త వీళ్లే మా అమ్మనాన్నలంటూ చెప్తున్నా ఆమెకేమీ అర్థం కాలేదు. 13 ఏళ్ల వయస్సులో ఉత్తర గ్వాటెమాలలోని ఆసుపత్రిలో అలీసియా ఆపరేషన్‌కు సిద్ధమైంది. ఆమెకు వయస్సెంతో తెలియదు. బంధువుల ద్వారా 13 ఏళ్లని తెలిసింది. గంట తర్వాత తక్కువ బరువుతో పుట్టిన బాబును వెంటనే ఇంక్యూబెటర్‌లో వేశారు. ఈ ఘటన అనంతరం కొన్ని రోజులకే 14 ఏళ్ల అమ్మాయికి అత్యవసర ఆపరేషన్‌ చేయడం ద్వారా తల్లి బిడ్డ ఇద్దరూ చనిపోయారని ఆసుపత్రి డాక్టర్‌ కార్లోస్‌ వస్‌క్వెజ్‌ తెలిపారు.

English summary

Relatives in Guatemala doing rapes with their children. A female reporter Linda Forsell did documentary on women from 4 years.