30 సెకన్లలో మూవీ డౌన్ లోడ్

Reliance Jio 4G Launch

12:30 PM ON 1st January, 2016 By Mirchi Vilas

Reliance Jio 4G Launch

30 సెకన్లలో మూవీ డౌన్‌లోడ్.. విన‌డానికి ఆశ్చ‌ర్యంగా ఉన్నా ఇది నిజ‌ం. రిలయన్స్ జియో ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్న 4జీ నెట్‌వర్క్ డౌన్‌లోడ్ స్పీడ్ 70 ఎంబీపీఎస్‌ను తాకింది. ఈ స్థాయి స్పీడ్‌లో సాధారణ సైజు ఉన్న బాలీవుడ్ మూవీ అర నిముషంలోనే డౌన్‌లోడ్ అవుతుంది. ముంబైలో ప్రత్యక్షంగా చేపట్టిన పరీక్షల్లో ఈ విషయం వెల్లడైంది. ఏప్రిల్, మార్చి నెలల్లో జియో వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ముకేష్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో 4జీ సర్వీసులను రిలయన్స్ సిబ్బంది కోసం ధీరూభాయి అంబానీ పుట్టిన రోజైన డిసెంబర్ 28న ప్రారంభించిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా తమ ఉద్యోగులకు, వారి స్నేహితులకు 25 శాతం డిస్కౌంట్‌తో స్మార్ట్‌ఫోన్లతోపాటు 4జీ కనెక్షన్లను ఇచ్చి ప్రయోగాత్మకంగా పరీక్షలు జరుపుతోంది. అర కిలోమీటరుకు ఒక టవ‌ర్ చొప్పున దేశ‌వ్యాప్తంగా రిలయన్స్ జియో 18,000 పట్టణాలు, నగరాల్లో 4జీ సర్వీసులను పరిచయం చేయనుంది. టవర్ కోసం పలు కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ సహా దేశవ్యాప్తంగా నెట్‌వర్క్ 80 శాతం పూర్తి అయినట్టు సమాచారం. కాగా, రిలయన్స్ జియో సొంత మొబైల్ బ్రాండ్ అయిన ‘లైఫ్’ కింద స్మార్ట్‌ఫోన్లను కూడా ప్రవేశపెడుతోంది. వీటి ధరల శ్రేణి రూ.4-32 వేలు ఉండ‌నుంది.

English summary

Reliance Jio 4G Launch