రిలయన్స్ ఫోన్ కూడా పేలిందట!

Reliance Lyf phone was blasted

11:51 AM ON 8th November, 2016 By Mirchi Vilas

Reliance Lyf phone was blasted

సెల్ ఫోన్ల విప్లవం కారణంగా ఇబ్బడిముబ్బడిగా స్మార్ట్ ఫోన్లు వచ్చేస్తున్నాయి. పైగా ఖరీదైన ఫోన్లు కూడా బానే అమ్ముడవుతున్నాయి. అయితే, ఇటీవల కాలంలో స్మార్ట్ ఫోన్లు పేలుతున్న ఘటనలు తరుచూ చోటు చేసుకుంటున్నాయి. మొన్నటి దాకా సామ్ సంగ్ నోట్ 7 ఫోన్లు పేలాయి. సామ్ సంగ్ నోట్ 7 పేలుతున్నందున ఆ సంస్థ తన కస్టమర్లకు ఫోన్లను రీప్లేస్ చేసింది. ప్రయాణికులు భద్రత కోసం వాటిని విమానాల్లో కూడా నిషేధించిన విషయం తెలిసిందే. ఇటీవలే యాపిల్ ఫోన్ కూడా పేలినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా జాబితాలో రిలయన్స్ లైఫ్ ఫోన్ కూడా చేరిందని అంటున్నారు.

జమ్మూకశ్మీర్ లోని నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీకి చెందిన తన్వీర్ సాధిక్ ఆదివారం తన రిలయన్స్ లైఫ్ స్మార్ట్ ఫోన్ ఛార్జింగ్ పెట్టినపుడు ఒక్కసారిగా పేలి మంటలు వ్యాపించినట్లు ట్విట్టర్ ద్వారా తెలిపారు. రిలయన్స్ జియో ఫోన్ల వినియోగదారులంతా జాగ్రత్తగా ఉండాలని, తన కుటుంబం తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకుందని పేర్కొన్నారు. ఈ ట్వీట్లపై మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కూడా స్పందించారు. పెద్ద ప్రమాదమే తప్పింది. అందరూ సురక్షితంగానే ఉన్నందుకు ఆనందంగా ఉంది. నేను ఇక ఇటువంటి స్మార్ట్ ఫోన్లను వాడను అని ఆయన పేర్కొన్నారు. ఇక ఈ విషయంపై రిలయన్స్ లైఫ్ ప్రతినిధులు స్పందిస్తూ.. లైఫ్ ప్రపంచంలోనే ప్రముఖ సెల్ ఫోన్ తయారీ కంపెనీ అని, అంతర్జాతీయ ప్రమాణాలతో ఫోన్లు రూపొందిస్తోందని వివరణ ఇచ్చారు. సోషల్ మీడియాలో వచ్చిన ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకుంటామని, దీనిపై విచారణ చేపట్టి తదుపరి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

English summary

Reliance Lyf phone was blasted