రూ 158/- కే గ్యాస్ సిలిండర్ .. జియో లాంటి ఆఫర్ తో రిలయన్స్ రెడీ!

Reliance planned gas cylinder for just Rs 158

11:50 AM ON 6th February, 2017 By Mirchi Vilas

Reliance planned gas cylinder for just Rs 158

బ్రాడ్ కాస్టింగ్ వ్యవస్థలో జియో సిమ్ లతో ఓ ఊపు ఊపుతున్న రిలయెన్స్ సంస్థ తాజాగా కీలకమైన .గ్యాస్ సిలిండర్ల రంగంలో కూడా తనదైన ముద్ర వేయడానికి రెడీ అవుతుందట. 427 రూపాయల గ్యాస్ సిలిండర్ ను కేవలం 158 రూపాయలకే అందించాలనే ప్లాన్ తో కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నంలో ఉన్నట్టు టాక్ .వాస్తవానికి గత సంవత్సరం ఈ విషయంపై పెద్ద ఎత్తున ప్రచారం జరిగినప్పటికీ….ఇది ఇంకా కార్యరూపం దాల్చలేదు.

ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కి పదును పెట్టినట్లు చెబుతున్నారు. 5 కేజీలు, 14.2 కేజీలు, 19 కేజీల గ్యాస్ సిలిండర్లను అతి తక్కువ రేట్లకే అందిస్తూ, .గ్యాస్ వినియోగదారులను పూర్తిగా తమవైపుకు తిప్పుకునే ప్లాన్ లో రిలయన్స్ భారీ మాస్టర్ ప్లాన్ వేసినట్లు చెబుతున్నారు. ఎందుకంటే, జియో సిమ్ లతోనే సదరు సంస్థకు రావాల్సిన ప్రచారం రావడంతో, ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు స్టార్ట్ చేయనున్నట్టు తెలుస్తోంది. జీయో ఆఫర్ ముగియగానే,.ఈ ఆఫర్ తో మార్కెట్ లో మరో మారు రిలయన్స్ పేరు మార్మోగి పోవాలనే ఆలోచన చేస్తున్నట్టు కధనం. ఇప్పటికే అనేక చమురు సంస్థలను దక్కించుకున్న రిలయన్స్ కు ఈ నిర్ణయం అంత అసాధ్యమేమీ కాదు..ఇక ఈ పధకం అమలయితే చమురు సంస్థలు ఎలా స్పందిస్తాయో చూడాలి. అసలు ఇలాంటి పధకం వస్తే, ఇక ప్రజలకు ఒనగూరే ప్రయోజనం అంతా ఇంతా కాదు.

ఇది కూడా చూడండి: సమంతా ప్రేమకథ చీర ... ఎలా తయారు చేశారో తెలుసా?

ఇది కూడా చూడండి: పెళ్ళికొడుకు లేడు ... అయినా పెళ్లయింది... ఎలా ?

English summary

Reliance is coming with next offer on gas cylinders for just Rs 158 only.