మంత్రి తనయుని కేసులో భలే ట్విస్ట్

Relief For Ravela Susheel Kumar In High Court

11:01 AM ON 26th April, 2016 By Mirchi Vilas

Relief For Ravela Susheel Kumar In High Court

చట్టాలను చుట్టాలుగా మార్చుకుని , కేసు పెట్టిన వాళ్ళనే అనుకూలంగా మలచుకుని కేసుల్లోంచి బయట పడడం సినిమాల్లో మనం చూస్తుంటాం. అయితే నిజ జీవితంలో కూడా ఓ మంత్రి తనయుని కేసు విషయంలో అలానే జరిగిందనే వాదన వినిపిస్తోంది. ఇక విమర్శలు వెల్లువెత్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే , ఏపీ మంత్రి రావెల కిషోర్‌బాబు కొడుకు సుశీల్‌కు హైకోర్టులో రిలీఫ్ లభించింది. బంజారా‌హిల్స్‌లో ఓ మహిళా టీచర్ పట్ల సుశీల్, ఆయన కారు డ్రైవర్ అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపణలు రావడం, కేసు నమోదు చేయడం, ఇది సంచలనం కావడం తెలిసిందే. ఇందులో భాగంగా వారిని పోలీసులు అరెస్టు చేసి జైలుకు కూడా పంపారు. ఆ తర్వాత వాళ్లు బెయిల్‌ పై విడుదలయ్యారు. దీని పై హైకోర్టుకు వెళ్లగా అక్కడ సుశీల్‌కు అనుకూలంగా తీర్పు వచ్చింది. తన పై పోలీసులు మోపిన అభియోగాల పై కోర్టుకి వెళ్లాడు సుశీల్‌కుమార్. దీని పై విచారణ చేపట్టిన హైకోర్టు.. బాధితురాలిగా పోలీసులు పేర్కొన్న మహిళ, కోర్టుకు వచ్చి రావెల సుశీల్ ఎవరో తనకు తెలియదని వాగ్మూలం ఇచ్చింది. దీంతో సరైన సాక్ష్యాలు లేని కారణంగా సుశీల్‌ పై ఆరోపణలను తొలగిస్తున్నట్టు కోర్టు పేర్కొంటూ తీర్పు వెలువరించింది. దీనిపై సోషల్ మీడియాలో విమర్శలు పడిపోతున్నాయి. కోర్టు నిర్దోషిగా పేర్కొంటే సహించలేకే అనవసరం విమర్శలు చేస్తున్నారని మంత్రి అనే మాట.

ఇవి కూడా చదవండి:భారతదేశంలో ఈ దేవునికి రూపం లేదు!

ఇవి కూడా చదవండి:చిరు పిక్చర్ కి ముహూర్తం ఫిక్స్

English summary

Andhra Pradesh Minister Ravela Kishore Babu's son Ravela Susheel Kumar was arrested in Harassment case recently and Yesterday that wonam said that she don't know who was ravela Susheel and he was released as Innocent by the court.