మడమనొప్పి నుండి ఉపశమనం పొందండిలా..

Relief from Heel Pain

02:46 PM ON 20th January, 2016 By Mirchi Vilas

Relief from Heel Pain

మడమ నొప్పి అనేది చాలా బాధాకరంగా ఉండటమే కాకుండా మన రోజువారీ పనులను కూడా ఆటంకపరుస్తుంది. ఈ నొప్పి మడమ కింద మరియు మడమ వెనక కూడా వస్తుంది.సాదారణంగా ఈ నొప్పి ఉదయం లేచిన వెంటనే ఉంటుంది. ప్లాట్ చెప్పులను వేసుకుంటే కొంచెం ఉపశమనం కలుగుతుంది.

మడమ నొప్పికి మడమ గాయాలు, బెణుకులు, పగుళ్లు, బలహీనమైన నాడులు వంటివి సాదారణ కారణాలుగా ఉన్నాయి. గట్టి ఉపరితలంపై అనుకోకుండా నడవటం,అధిక బరువు ఉండటం,సరైన బూట్లు ధరించకపోవటం వలన కూడా మడమ నొప్పి వస్తుంది. అంతేకాక అకిలెస్ స్నాయువు శోథ, తిత్తుల వాపు, ఫైబ్రోమైయాల్జియా,గౌట్, అరికాలి
ఫాసిట్స్,ఆర్థరైటిస్, ఎముకలకు సంబంధించిన టన్నెల్ సిండ్రోమ్ మరియు స్నాయువు వంటి  అనేక వైద్య పరిస్థితుల కారణంగా కూడా మడమ నొప్పి రావచ్చు.

కొన్ని ఇంటి నివారణలను మరియు జీవనశైలిలో కొన్ని మార్పులను చేసుకుంటే మడమ నొప్పి తగ్గుతుంది. మడమనొప్పి చాలా తీవ్రంగా ఉంటే మాత్రం తప్పనిసరిగా వైద్యున్ని సంప్రదించాలి.

1/11 Pages

ఇక్కడ సహజంగా మడమ నొప్పి నుండి ఉపశమనం పొందటానికి 10 మార్గాలు ఉన్నాయి.

1. ఐస్

మడమ నొప్పి ఉపశమనానికి ఐస్ పెట్టటం అనేది ఒక సహజమైన మార్గం అని చెప్పవచ్చు. చల్లని ఉష్ణోగ్రత కారణంగా నొప్పి మరియు వాపు నియంత్రించటానికి ఆ ప్రదేశం  స్పర్శరహితంగా మారుతుంది. అంతేకాక స్నాయువు నొప్పి, అరికాలి ఫేసియా, ఎముక చీలికమార్గం నొప్పులను ఐస్ చాలా ప్రభావవంతంగా తగ్గిస్తుంది.

* ఐస్ ని పలుచని కాటన్ టవల్ లేదా ఒక ప్లాస్టిక్ కవర్ లోగాని వేసి క్రష్ చేసి నొప్పి ఉన్న ప్రాంతంలో పెట్టి 15 నిముషాలు ఉంచాలి. అవసరమైతే రోజులో కొన్ని సార్లు రిపీట్ చేయాలి.

* మరొక ఎంపికగా ఒక వాటర్ బాటిల్ లో నీటిని ఫ్రిజ్ చేసి నొప్పి ఉన్న ప్రాంతంలో 10 నుండి 15 నిమిషాల పాటు రోల్ చేయాలి. అవసరమైతే రోజులో కొన్ని సార్లు రిపీట్ చేయాలి.

గమనిక : ఐస్ ని చర్మంపై నేరుగా ఎప్పుడు పెట్టకూడదని గుర్తుంచుకోవాలి.

English summary

Heel pain is a very common foot problem. Here are the some ways to get relief from heel pain naturally.