టీనేజ్ స్పాట్స్ నివారణకు చిట్కాలు

Remedies for Age Spots

10:52 AM ON 1st March, 2016 By Mirchi Vilas

Remedies for Age Spots

సాదారణంగా వయస్సు మచ్చలను లివర్ స్పాట్స్ లేదా సూర్యుడు మచ్చలు అని పిలుస్తారు. చర్మం మీద సూర్యుని కిరణాలు ఎక్కువగా పడటం వలన ఈ మచ్చలు సంభవిస్తాయి. కాలేయం పనితీరు మందగించడం లేదా పోషక లోపం వంటి కారణాల వలన కూడా ఈ మచ్చలు వస్తాయి. సాదారణంగా ఈ మచ్చలు ముఖం, మెడ మరియు చేతుల మీద వస్తాయి. ఈ మచ్చలు ప్రమాదకరం కాదు. అయితే మచ్చ రంగులో కానీ ఆకారంలో కానీ మార్పులు ఉంటే మాత్రం వైద్యున్ని సంప్రదించాలి.

1/8 Pages

1. ఆపిల్ సైడర్ వెనిగర్

ఆపిల్ సైడర్ వెనిగర్ వయస్సు మచ్చలను తగ్గించటంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఆపిల్ సైడర్ వెనిగర్ కి తాజా ఉల్లిపాయ రసాన్ని కలిపి ప్రభావిత ప్రాంతంలో రాసి 45 నిమిషాల తర్వాత శుభ్రం చేయాలి. ఈ విధంగా రెండు నెలల పాటు చేస్తే మంచి పలితం పొందవచ్చు. చల్లని / వెచ్చని నీటితో ఆపిల్ సైడర్ వెనిగర్ కలిపి కూడా ఉపయోగించవచ్చు. శీఘ్ర ఫలితాల కోసం రోజులో రెండు సార్లు, నాలుగు వారాల పాటు రాయాలి.

English summary

Here Remedies for Age Spots. Age spots are harmless. It is advisable to consult a doctor if an individual has dark spots that change in size, colour or texture. It may be possible to treat age spots with the use of different types of home remedies.