వెన్నునొప్పితో బాధపడుతున్నారా?

Remedies for back pain

11:36 AM ON 15th December, 2015 By Mirchi Vilas

Remedies for back pain

వెన్నునొప్పి సాధారణంగా అందరిలో కనపడే సమస్యే ఇది ఎక్కువగా మధ్యవయస్సు వారిలో, వృద్ధులకు ఎదురయ్యే అతిపెద్ద సమస్య. ఈ మధ్య కాలంలో యవ్వనంలో ఉన్నవారు కూడా ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. వెన్నునొప్పి కాస్తాఎక్కువై నడుంనొప్పికి దారి తీస్తుంది. అందుకే జాగ్రత్త వహించడం చాలా మంచిది. అసలు వెన్నునొప్పి రావడానికి గల కారణాలు సరిగ్గా ఆహారం తినకపోవడం ఎక్కువసేపు కూర్చోవడం, సరైన పద్దతిలో కూర్చోకపోవడం వలన ఈ సమస్యకు గురవుతారు. ఈ సమస్యవలన ఒక్కోసారి రోజువారీ పనులకు ఆటంకం కలుగుతుంది. అందువల్ల ఇది పెద్దసమస్యగా మారక ముందే ప్రధమ చికిత్స ఎంతో అవసరం. ఇంట్లో ఉంటూనే కొన్ని పద్ధతులను వాడడం వలన వెన్ను నొప్పిని నివారించవచ్చు.

1/10 Pages

1. అల్లం

అల్లం చాలా ఔషధ గుణాలు కలిగి ఉంది. దీనిని వంటకాలలో రోజూ వాడడం వలన మంచి ఆరోగ్యాన్ని పొందుతారు. దీనిలో యాంటీ ఇన్‌ప్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇది వెన్నునొప్పిని అరికట్టడంలో అద్బుతంగా పనిచేస్తుంది.

1. అల్లం పేస్ట్‌ని నొప్పిగా ఉన్న ప్రదేశంలో రాసుకోవాలి తరువాత యూకలిప్టస్‌ ఆయిల్‌ని రాసుకోవడం వలన మంచి ఫలితం ఉంటుంది.

2. అల్లాన్ని చిన్నిచిన్ని ముక్కలుగా కోసుకుని ఒకపాత్రలోకి తీసుకుని దానిలో కొద్దిగ నీళ్ళుపోసి వేడిచేయాలి. 10 నుండి 15 నిమిషాలు గడిచిన తరువాత ఆ నీటిని ఆరనివ్వాలి. దానిలో కొద్దిగ తేనె కలిపి ఆ నీటిని తాగడం వల్ల మంచి ఫలితాన్ని పొందుతారు.

ఈ విధంగా అల్లం టీ ని రోజుకి 2 లేదా 3 సార్లు తాడగం వలన మంచి ఫలితాన్ని పొందుతారు.

English summary

Are you facing back pain then follow these steps you get relief from back pain.