మీ పిల్లలు జలుబుతో బాధపడుతున్నారా ?

Remedies for cold and coughs

03:26 PM ON 17th December, 2015 By Mirchi Vilas

Remedies for cold and coughs

చిన్న పిల్లలు తరచూ జలుబు, దగ్గుతో బాధపడుతూ ఉంటారు. పిల్లలలో వ్యాధినిరోదక శక్తి బలహీనంగా ఉండడం వలన అస్తమానం ఈ సమస్యలతో సతమతమవుతుంటారు. వీరికి తొందరగా మరియు సులభంగా ఇన్ఫెక్షన్స్‌ వస్తాయి. ఎందుకంటే కలుషితమైన గాలి మరియు నేల వల్ల పిల్లలకి తొందరగా అలర్జీలు సోకుతాయి. అందుచేత కన్నతల్లి ఎల్లవేళలా వారి బాగోగులు చూసుకుంటూ, పిల్లల ఆరోగ్యాన్ని సంరక్షించుకుంటూ ఉంటుంది. చిన్నపిల్లలని ఎక్కువగా వేధించేవి జలుబు, దగ్గు వీటి లక్షణాలు పిల్లలలో ఎలా ఉంటాయంటే 100.4 డిగ్రీల పారెన్‌హీట్ జ్వరం, తుమ్ములు, నిద్రలేకపోవడం మొదలగు సమస్యలతో బాధపడతారు. ఇలా అనారోగ్యంతో బాధపడుతన్న శిశువులను తల్లిదండ్రులు జాగ్రత్తగా సంరక్షించుకోవాలి. నిజానికి జీవితం ప్రారంభించిన మొదటి సంవత్సరంలోనే చాలా మంది చంటి బిడ్డలకు 7 రకాల పట్టు విడువని జలుబులు సోకుతాయని నిపుణులు తెలియజేసారు. అంతే కాకుండా 6 సంవత్సరాల లోపు పిల్లలకి ఎటువంటి మందులు వేయరాదని తెలిపారు. 3 సంవత్సరాల లోపు పిల్లలకు 100.4 డిగ్రీల జ్వరం వచ్చిన వేంటనే ఆలస్యం చేయకుండా డాక్టర్‌ని సంప్రదించాలని సూచించారు. కొన్ని చిట్కాలను వాడడం వలన ఇంట్లో  పిల్లలను  సురక్షితంగా చూసుకోవచ్చు. ఆ చిట్కాలను ఎలా పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

1/9 Pages

1. స్సాంజ్‌ బాత్‌

చిన్నపిల్లలకి జ్వరం వచ్చినట్లయితే చన్నీటితో స్నానం లేదా స్పాంజ్‌ బాత్‌ చేయడం వలన శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది. అంతేకాకుండా పిల్లలు ప్రశాతంగా చక్కగా నిద్రపోతారు.

  • రోజులో స్పాంజ్‌ బాత్‌ 2 లేదా 3 సార్లు చేయడం వలన మంచి ఫలితాన్ని పొందుతారు.
  • ఒక వస్త్రాన్ని గది ఉష్ణోగ్రత వద్ద నీటిలో నాన పెట్టి ఆ వస్త్రంలో అధికంగా ఉన్న నీటిని పిండి జ్వరం సోకిన పిల్లాడి కాళ్ళను, చేతులను, అరికాళ్ళ లో ఆ వస్త్రంతో తుడవాలి. తరువాత తడి గుడ్డని నుదిటి మీద ఉంచడం వలన శరీరంలోని వేడిని బయటకు విడుదల చేస్తుంది.
  • కొంచెం పెద్దవారు అయితే కనుక చన్నీటితో స్నానం  చేయడం వల్ల కొంచెం ఉపసమనం లభిస్తుంది.

గమనిక : మరీ చల్ల నీటిని వాడరాదు. దాని వల్ల శరీరంలో ఉష్ణోగ్రత పెరుగుతుంది.

English summary

Children pick up the various infection causing viruses through contact with an infected person or contaminated air or surfaces.