పగిలిన వేళ్ళకు చిట్కాలు

Remedies for Cracked Fingers

11:23 AM ON 27th February, 2016 By Mirchi Vilas

 Remedies for Cracked Fingers

చేతులు మరియు వేళ్లు కఠినముగా ఉంటే,అప్పుడు వాటికి తేమ అవసరం ఉందని గ్రహించాలి. తేమ లేకపోతే చేతులు మరియు వేళ్లు పొడిగా మారి చివరకు పగుళ్ళకు దారితీస్తుంది. అంతేకాక పగుళ్ళు రావటానికి పొడి గాలి, కఠినమైన రసాయనాలు ఉన్న చర్మ ఉత్పత్తులను వాడటం,వాతావరణ పరిస్థితులు, సామాను తోమటం,బట్టలు ఉతకటం వంటివి కారణం అవుతాయి. అయినప్పటికీ కొన్ని ఇంటి నివారణల ద్వారా వేళ్ళ పగుళ్ళను నయం చేసుకోవచ్చు.

1/11 Pages

1. గోరువెచ్చని నీరు

ఒక బౌల్ లో గోరువెచ్చని నీటిని తీసుకోని దానిలో పది నిమిషాల పాటు వేళ్ళను ఉంచాలి. ఈ విధంగా చేయుట వలన చేతులకు మరియు వేళ్ళకు ఉన్న మురికి తొలగిపోతుంది. పొడి చర్మ కణాలు చర్మం పై పొర మీద చేరతాయి. గోరువెచ్చని నీటిలో వేళ్ళను పెట్టినప్పుడు పొడి చర్మ కణాలు సులభంగా స్క్రబింగ్ అవుతాయి. ఎప్సోమ్ ఉప్పును ఉపయోగిస్తే మృత కణాలను తొలగించటానికి మరియు పగుళ్ళను నయం చేయటంలో అద్భుతంగా పనిచేస్తుంది.

English summary

Skin on the fingers and hands become dry and finally lead to cracks. A few home remedies help in reversing the damage and healing the cracked fingers. So follow these tips you get smooth and lovely fingers.