లూస్‌ మోషన్సా- అయితే ఇదిగో చిట్కా..

Remedies for loose motions

11:39 AM ON 11th December, 2015 By Mirchi Vilas

Remedies for loose motions

ఇది సాధారణంగా అందరిలో అప్పుడప్పుడు కలిగే సమస్యే. లూస్‌ మోషన్స్‌ వల్ల చాలా ఇబ్బంది కరంగా అసౌకర్యంగా ఉంటుంది. దానివల్ల పనిమీద దృష్టిని పెట్టలేరు నీరసం అయిపోతారు. శరీరంలోని నీరంతా పోవడం వలన చాలా నీరసంగా ఉంటుంది. అలాంటి సమయంలో డాక్టర్‌ దగ్గరకు వెళ్ళడానికి కూడా ఓపిక ఉండదు. ఈ లూస్‌ మోషన్స్‌ కోసం ఇంట్లో వాడే కొన్ని చిట్కాలను చూద్దాం. వీటిని పాటించడం వలన లూస్‌ మోషన్స్‌ ని అరికడతాయి, త్వరిత  ఉపసమనం పొందవచ్చు. అందువల్ల ఈ సమస్యతో బాధ పడేవారు ఇంట్లో ఉంటూనే కొన్ని పద్ధతులను ఎలా పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

1/7 Pages

1. దానిమ్మ తొక్క

దానిమ్మ తొక్క చాలా సమర్ధవంతంగా ఈ సమస్యను ఎదుర్కొంటుంది. ఇది ఒక చక్కని నివారణి. ఎప్పుడూ ఒక గాజు సీసాలో కొన్ని ఎండిన దానిమ్మ తొక్కలను నిల్వఉంచుకోండి. దానివల్ల ఎప్పుడైనా అత్యవసర సరిస్థితి ఏర్పడినప్పుడు ఉపయోగపడతాయి. ఎండిపోయిన తొక్కలను 3 లేదా 4 తీసుకుని వాటిలో కొంచెం నీటిని పోసి తక్కువ మంట మీద వేడి చేయాలి. రుచి కోసం కొద్దిగ పంచదారని జోడించవచ్చు. తీసుకున్న నీరులో సగం ఇంకిపోయేవరకు వేడి చేయాలి. తయారయిన కషాయాన్ని చల్లబరిచి, తేలిక ఆహారాన్ని తిన్న తరువాత త్రాగాలి.

మీరు దానిమ్మ తొక్కలను ఎండబెట్టి వాటిని పొడి చేసుకునని గాజు సీసాలో నిల్వఉంచుకోవచ్చు. ఎప్పుడైనా అవసరం అనిపిస్తే 1/2 టీస్పూన్‌ పొడిని తీసుకుని అందులో ఒక కప్పు పెరుగు కలపాలి. దీనిని ఉదయం ఖాళీ కడుపుతో తినాలి. ఇలా చేయడం వలన లూస్‌ మోషన్స్‌ ని అరికట్టవచ్చు.

English summary

If you pass more than 4 loose motions in a day then opting for some home remedies along with consumption of lots of fluids is the best bet.