చర్మ వ్యాధులకు చికిత్స

Remedies for skin infections

02:06 PM ON 15th December, 2015 By Mirchi Vilas

Remedies for skin infections

అందరికీ ఏదో ఒక సమయంలో అంటువ్యాధుల సమస్య వేదిస్తుంది. అలాంటి సమయంలో మార్కెట్‌లో దొరికే యాంటిసెప్టిక్‌ మందులు కొని వేసుకుంటారు. కానీ వీటిని వాడడం వలన అన్నివేళలా మంచిది కాదు. ఒక్కోసారి దుష్ప్రభావాలకు దారి చూపుతాయి. రసాయనాల వల్ల చర్మానికి నష్టం వాటిల్లుతుంది. చర్మం గరుకుగా మారిపోయి మృదుత్వాన్ని కోల్పోతుంది. అందువల్ల చిన్న సమస్యగా ఉన్నప్పుడే ఇంటి చిట్కాలను ఉపయోగించి నయం చేసుకోవడం చాలా మంచిది. దీనివల్ల చర్మానికి ఎటువంటి హాని కలుగదు. అంతేకాకుండా ఆరోగ్యకరమైన చర్మాన్ని పొందుతారు. నిజానికి ఇంటి చిట్కాలు అద్బుతంగా పనిచేస్తాయి. మీ అంటు వ్యాధులను పటాపంచలు చేస్తాయి. ఆ అద్బుతమైన చిట్కాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.

1/7 Pages

1. పసుపు

పసుపులో యాంటిసెప్టిక్‌ గుణాలు ఉన్నాయి. చర్మాన్ని  అంటువ్యాధుల నుండి దూరం చేస్తుంది. ఇది అందరికీ అందుబాటులో ఉండే పదార్ధమే. దీనిని వాడటం వలన ఎటువంటి అలర్జీలు దరిచేరవు. పాత రోజుల్లో ప్రతిఒక్కరు గుమ్మానికి పసుపు రాసుకునే వారు, కాని అందరూ దీనిని మూఢ నమ్మకంగా పరిగణిస్తారు. అది ముమ్మాటికి తప్పు. నిజానికి ఎటువంటి హానికారక కీటకాలు ధరిచేర నివ్వకూడదని అలా చేసేవారు. పసుపులో యాంటిసెప్టిక్‌ గుణాలు ఉండడం వలన ఎటువంటి బ్యాక్టీరియాను లోపలికి రానివ్వదు. అందువల్ల గుమ్మానికి పసుపు రాసుకునే వారు అదే విధంగా పసుపు మనం వాడడం వలన శరీరంలో ఉండే అంటువ్యాధులు నశిస్తాయి. అంటువ్యాధులకు కారణమైన బ్యాక్టీరియాలను అరికడుతుంది. అంతేకాకుండా చర్మ సంబంధమైన సమస్యను దూరం చేస్తుంది. మొటిమలు, దద్దుర్లు మొదలగునవి రూపుమాపుతుంది. దీనిని వంటకాలలో తరచూ వాడడం వలన మంచి ఫలితాన్ని పొందుతారు.

English summary

Everybody of us is familiar with the skin infections problems. You don’t worry follow these steps then you get healthy skin.