పళ్ళు మిల మిలా మెరవాలంటే !!

Remedies for whiten teeth at home

06:55 PM ON 1st December, 2015 By Mirchi Vilas

Remedies for whiten teeth at home

కొంత మంది పళ్ళు ముత్యాల్లా ఉంటాయి. వారు నవ్వితే ముత్యాలు రాలుతున్నాయా అనిపించేలా ఉంటుంది. మరి అలాంటి పళ్ళు మీ సొంతం కావాలని మీకు అనిపించడం లేదా? అయితే కొన్ని చిట్కాలను ఫాలో అయితే సరిపోతుంది. అవి ఎలా పాటించాలో చూద్ధాం. అసలు పళ్ళు పసుపుపచ్చగా మారడానికి గల కారణం ఏమిటో తెలుసా? మనం తినే ఆహారమే. అవును మనం తినే ఆహారం, తాగే పానియాల వలన తెల్లటి ముత్యాల లాంటి పళ్ళు పసువు రంగులోని మారుతాయి. కొంత మంది అదే పనిగా టీ, కాఫీ లు తాగుతారు వారు కుడా ఈ సమస్యను ఎదుర్కోనాల్సిందే. ఇంకా గుట్కా, వక్కపొడి, పాన్‌ పరాక్ ఇటువంటివి తినడంవలన పంటిపై ఉన్న ఎనామిల్‌ దెబ్బతిని పంటి రంగు మారడనికి సహాయపడుతుంది. అందువల్ల వీలుయినంతవరకు వాటికి దూరంగా ఉండటం మంచిది. ఏమైనా ఆహార పదార్ధాలు తినిన వెంటనే నోటిని నీటితో శుభ్రపరుచుకొవడం వల్ల పళ్ళు అనారోగ్యానికి గురికాకుండా ఉంటాయి.

1. బేకింగ్‌ సోడా మరియు నిమ్మరసం

బేకింగ్‌ సోడా అసలు పేరు సోడియంబైకార్బొనేట్‌. దీనిని వాడటం వలన పళ్ళు పై ఉన్న మరకలు మాయం చేస్తుంది.

కావలసినవి:

 • బేకింగ్‌ సోడా తగినంత
 • నిమ్మరసం లేదా నీళ్ళు
 • టూత్‌బ్రష్‌

పాటించే విధానం :

 • కొన్ని టీ స్పూన్‌ తో బేకింగ్‌ సోడాని ఒక గిన్నెలోని తీసుకొని దానిలో పేస్ట్‌ చేయడానికి కావలసినంత నిమ్మరసాన్ని తేదా నీటిని వేసి కలపాలి.
 • వచ్చిన మిశ్రమాన్ని టూత్‌బ్రష్‌ మీద వేసి పళ్ళును తోముకోవాలి. ఈ పేస్ట్‌ని పళ్ళు మీద 1 నిమషం పాటు వదిలేయాలి. అదే నిమ్మరసానికి బదులుగా నీటిని కలిపినట్లయితే 3 నిమషాలపాటు ఉంచడం వలన పంటిపై ఉన్న యాసిడ్‌ కి గురి అయిన ఎనమిల్ తొలగిపోతుంది.

2. స్ట్రాబెర్రీ, ఉప్ప మరియు బేకింగ్‌ సోడా

స్ట్రాబెర్రీ లో అధిక మోతాదులో విటమిన్‌ సి ఉంటుంది. ఇది పంటి రంగును తెలుపుగా మార్చడంలో సహాయపడుతుంది దీనిలో మేలిక్‌ యాసిడ్‌ అనే ఎంజైమ్‌ కుడా ఉంది. దీని వల్ల పంటి పై ఏర్పడ్డ పసుపు రంగు పొరలను పోగొట్టి తెల్లని పళ్ళు మీ సొంతం అయ్యేలా చేస్తుంది.

కావలసినవి:

 • స్ట్రాబెర్రీ -1 నుండి 3 వరకు
 • ఉప్ప - కొంచెం
 • బేకింగ్‌ సోడా - 1/2 టీ స్పూన్‌ (ఆప్షనల్‌)

పాటించే విధానం:

 • స్ట్రాబెర్రీ లను మెత్తగా చేసుకోవాలి. అందులో కొంచెం ఉప్ప వేసుకొని బాగా కలపాలి. ఇప్పడు 1/2 టీ స్పూన్‌ బేకింగ్‌ సోడాని కూడా కలపాలి.
 • తయారయిన మిశ్రమాన్ని వాడే ముందు పళ్ళును తడిలేకుండా శుభ్రంగా టవల్‌తో తుడుచుకొని తరువాత ఈ మిశ్రమాన్ని టూత్‌బ్రష్‌ పై వేసుకొని పళ్ళు తోముకోవాలి. అలా 5 నిమిషాలు పాటు ఆ మిశ్రమాన్ని పంటిపై ఉండేలా చూసుకొని తరువాత శుభ్రంగా నీటితో కడగాలి.
 • ఇలా చేయడం వలన మంచి ఫలితం పోందుతారు.

3. కొబ్బరి నూనె

ఏంటి కొబ్బరి నూనె అనగానే షాక్‌ తిన్నారా? అవును కొబ్బరి నూనె కూడా ఈ చిట్కాలలో ఒకటి ఇది ఇప్పటికాలం నాటిది కాదు. చాలా పాతకాలం నాటిదే. దీనినే “ఆయిల్‌ పుల్లింగ్‌” అంటారు ఇది బ్లీచింగ్‌ కాకపోయినా అంతటి ఫలితాన్ని మాత్రం కచ్ఛితంగా ఇస్తుంది. దీనిలో లారిక్‌ యాసిడ్‌ ఉండటం వలన ఇది పంటి మీద ఉండే బ్యాక్టీరీయాని నశింపచేసేలా చేసి పళ్ళుకు పసుపు రంగు నుండి విముక్తి కలిగేలా చేస్తుంది.

కావలసినవి:

 • ఒక టేబుల్‌ స్పూన్‌ కొబ్బరి నూనె

పాటించే విధానం:

 • ఉదయం పళ్ళు తోముకునే ముందు ఒక చెంచాతో కొబ్బరి నూనెను తీసుకోవాలి.
 • నూనె ను నోటిలో వేసుకొని 10 నుండి 15 నిమిషాల పాటు పుక్కిలించాలి ( ఆయిల్‌ పుల్లింగ్‌ ) .
 • తరువాత ఆ నూనెను ఊసేసి నీటితో శుభ్రపరుచుకుని ప్రతి రోజులాగే పళ్ళు తోముకోవాలి.
 • ఇలా చేయడం వలన మంచి ఫలితాన్ని పొందుతారు.

పైన తెలిపిన పద్ధతులలో మీకు నచ్చిన దాన్ని పాటించండి. ఇలా చేయడం వలన ఒక వారంలో అద్భుతమైన ఫలితాన్ని పొందుతారు.

English summary

Remedies for whiten teeth at home. There remedies will focus on whitening teeth that have already lost some white enamel.