మెరిసే మెడ కోసం

Remedies to cure dark neck

03:24 PM ON 9th December, 2015 By Mirchi Vilas

Remedies to cure dark neck

అందరూ అందం అంటే చాలు ముఖం గురించి మాత్రమే జాగ్రత్తలు తీసుకుని అందంగా ఉన్నాం అనుకుంటారు. కాని ముఖం తెల్లగా అందంగా ఉంది మెడ మాత్రం నల్లగా ఉంటే ఎలా ఉంటుంది. కొంచెం దాని గురించి కూడా ఆలోచించండి... చాలా మంది అసలు పట్టించుకోరు అందువల్ల మెడ నల్లగా మారి అసహ్యంగా కనపడుతుంది. అలాగే పట్టించుకోకుండా వదిలేయడం వల్ల  అది మొండి మచ్చగా మారి తొందరగా పోదు. అందువల్ల మెడపై ఉన్న నలుపుని తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. దీని కోసం మీరు చింతించాల్సిన అవసరం లేదు. మీ వంటగదిలో సులభంగా దొరికే వాటితోనే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది.  పరిష్కార మార్గాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

1/5 Pages

1. శనగపిండి మరియు తేనె ప్యాక్‌

ఈ ప్యాక్‌ నల్లని మెడపై ప్రభావవంతంగా పనిచేసి రూపుమాపుతుంది.

కావలసినవి:

  • శనగపిండి - 2 టేబుల్‌ స్పూన్‌
  • తేనె-1 టేబుల్‌ స్పూన్‌
  • నిమ్మరసం - 1 టేబుల్‌ స్పూన్‌

తయారుచేయు విధానం:

  • ఒక చిన్న గిన్నెలోకి శనగపిండి తీసుకుని అందులో తేనె, నిమ్మరసం కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి.
  • ఈ పేస్ట్‌ని మెడకి బాగా రాసుకుని బాగా ఆరే వరకు వేచి ఉండాలి.
  • తరువాత గోరు వెచ్చని నీటితో శుభ్రంగా కడగాలి.
  • ఇలా రోజు విడిచి రోజు చేయడం వలన నలుపు రంగు నుండి విముక్తి పొందుతారు.

English summary

You have dark neck don’t worry so much there are several home remedies are available to cure the problem of dark neck.