నిగారించే చేతులకు 5 చిట్కాలు

Remove tan from your exposed parts

03:40 PM ON 21st December, 2015 By Mirchi Vilas

Remove tan from your exposed parts

మన శరీరంలో బహిర్గత భాగాలలో చేతులు ఒకటి. ఇవి వాతావరణంలో కలిగే మార్పులకు గురవుతుంటాయి. ముఖ్యంగా వేసవి కాలంలో చెప్పనవసరం లేదు. చేతులు ఎండ తాకిడికి కమిలిపోతాయి. అలాగే వంటగదిలో వంటలు చేసుకునేటప్పుడు సుకుమారమయిన చేతులు వేడి తాకిడి వలన కమిలిపోయి నల్లగా మారుతాయి. దీనివల్ల శరీరం అంతా ఒక రంగులో ఉండి బయటకు కనిపించే భాగాలు మాత్రం వేరొక రంగులో చూడడానికి చిరాకుగా ఉంటాయి. ఎప్పుడైనా ఏదైనా పార్టీకి మంచి దుస్తులలో వెళ్ళాలన్నా ఈ రకం చర్మం వల్ల కొంత ఇబ్బందిని ఎదుర్కోవాల్సి వస్తుంది. దీనికోసం బయపడాల్సిన అవసరం లేదు. మార్కెట్లో చాలా రకాల ప్రొడెక్ట్స్‌ లభిస్తాయి. అలా కాకుండా ఇంట్లో ఉంటూ సులభమైన పద్ధతులను అనుసరించి తిరిగి అందమైన చర్మాన్ని పొందేందుకు కొన్ని చిట్కాలు ఉన్నాయి. వీటిని వాడడం వలన ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా సహజంగా చర్మాన్ని తెల్లగా మరియు నిగారించే విధంగా చేసుకోవచ్చు. ఆ అద్బుతమైన 5 చిట్కాలను ఇప్పుడు తెలుసుకుందాం.

1/6 Pages

1. పమిస్‌ స్టోన్‌ మరియ పాలు

పమిస్‌ స్టోన్‌ మరియు చల్లని పాలను తీసుకోవాలి. చల్లని పాలు మీ చర్మాన్ని పొడిబారకుండా చూసుకుని కాంతివంతంగా చేస్తాయి.

కావలసినవి :

  • పమిస్‌ స్టోన్‌
  • చల్లని పాలు

పాటించే పద్ధతి :

  • పమిస్‌ స్టోన్‌ని పాలలో నానబెట్టాలి. తరువాత ఆ రాయితో మీ చేతులను వలయాకారంలో మృదువుగా రుద్దాలి. ఈ విధంగా 15 నుండి 20 నిమిషాలు మసాజ్‌ చేసుకోవాలి.
  • ఈ విధంగా చేయడం వలన మీ చేతులపై ఏర్పడిన మృతకణాలు తొలగి చర్మం కాంతి వంతంగా మారుతుంది.
  • పాలలోని పోషకాల వలన చర్మాన్ని రక్షించి చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. దీనిలో బ్లీచింగ్‌ గుణాలవలన చర్మాన్ని శుభ్రపరుస్తుంది. ఈ పద్ధతిని వారానికి 1 లేదా 2 సార్లు క్రమం తప్పకుండా చేయడం వలన మీ చేతులు తెల్లగా నిగారిస్తాయి.

English summary

Especially in summer when we wear shot sleeves or sleeveless garments. The most exposed parts get tan, follow these steps remove tan easily.