ముఖం పై అవాంఛిత రోమాలా ?

Remove unwanted hair at home

11:36 AM ON 18th December, 2015 By Mirchi Vilas

Remove unwanted hair at home

సాధారణంగా కొందరి మహిళల్లో ముఖం పై అవాంఛిత రోమాలు వస్తుంటాయి. వాటివల్ల చాలామంది మహిళలు ఇబ్బంది పడుతుంటారు. స్వేచ్చగా బయటతిరగలేరు. చాలా సూటిపోటి మాటలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ రోమాలవలన చర్మసౌందర్యం కాస్తా అంద విహీనంగా తయారవుతుంది. వీటిని నివారించడానికి త్రెడింగ్‌, షేవింగ్‌, వ్యాక్సింగ్‌ మొదలగు కృత్రిమ పద్దతులు ఉన్నాయి. అలా అని ఈ పద్దతులను వాడడం వలన చాలా దుష్ప్రభావాలు సంభవిస్తాయి. వీటిని చేసుకునే సమయంలో చర్మం తెగి రక్తం కారే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎటువంటి ప్రమాదం లేకుండా మీ ముఖం మీద ఏర్పడిన అవాంఛిత రోమాలను తొలగించాలంటే కొన్ని ఇంటి చిట్కాలు ఉన్నాయి. మనం రోజూ ఉపయోగించే కొన్ని పదార్ధాలను ఉపయోగించి ముఖం పై పెరిగిన రోమాలను తొలగించుకోవచ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

1/6 Pages

1. శెనగపిండి ఆముదం ప్యాక్‌ 

కావలసినవి

  • శెనగపిండి - 1 టేబుల్‌ స్పూన్‌
  • ఆముదం - 1 టేబుల్‌ స్పూన్‌
  • మీగడ - 1 టేబుల్‌ స్పూన్‌
  • రోజ్‌ వాటర్‌ - 1 టేబుల్‌ స్పూన్‌
  • గంధం - 1 టేబుల్‌ స్పూన్‌
  • పసుపు - కొంచెం

తయారుచేయు పద్దతి

  • ఒక పాత్ర తీసుకుని అందులో ఒక టేబుల్‌ స్పూన్‌ శెనగపిండి మరియు ఒక టేబుల్‌ స్పూన్‌ గంధం తీసుకుని దాంట్లో తాజా మీగడ, ఆముదం, రోజ్‌ వాటర్‌ కలపాలి. ఇప్పుడు పసుపు కూడా వేసి బాగా అన్నీటిని కలిసే విధంగా కలపాలి.
  • ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అవాంఛిత రోమాలు కలిగిన ప్రాంతంలో రాయాలి.
  • 20 నిమిషాలు గడిచిన తరువాత రివర్స్‌ లో మసాజ్‌ చేయాలి. ఆ తరువాత చల్లని నీటితో కడగాలి.

English summary

The home remedies given here for unwanted hair removed are very easy to follow. Find out which of the method is most suitable for your unwanted hair.