ఫోన్ లో నాన్న ఫొటో పెట్టుకోమంటూ అమ్మకు ట్వీట్

Renu Desai Change Her DP For Her Daughter

10:37 AM ON 3rd September, 2016 By Mirchi Vilas

Renu Desai Change Her DP  For Her Daughter

ఏ బంధం మరిచిపోయినా పెళ్లి బంధం పెనవేసుకుని ఉంటుంది. అందుకే విడిపోయినా సరే రేణు దేశాయ్ అప్పుడప్పుడు పవన్ కల్యాణ్ జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ఉంటుంది. ఇప్పుడు పవన్ కుమార్తె ఆద్య తన తండ్రి పుట్టినరోజు సందర్భంగా తల్లి రేణూదేశాయ్ కు ఓ మాట చెప్పిందట. రేణు తన ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని అభిమానులతో పంచుకుందామె. ‘అమ్మా ఈరోజు నాన్న పుట్టినరోజు కదా, అందుకని నువ్వు ఫోన్ లో నాన్న ఫొటో పెట్టుకోవాలి’ అని చెప్పిందట.

కేవలం పాప ఆనందం కోసమే ఈరోజు తన డీపీ మార్చానని రేణు ట్వీట్ చేసింది. ఇన్నాళ్లూ తన ఫొటోను ఫేస్ బుక్ , ట్విట్టర్ ప్రొఫైల్ లో పెట్టుకున్న రేణు.. కుమార్తె చెప్పిందని ఇవాళ పవన్ ఫొటోను ప్రొఫైల్ గా పెట్టుకున్నారు. దీంతో ఆనందపడిన పవన్ అభిమానులు వదినమ్మా ధన్యవాదాలు, క్యూట్ డాటర్ , సూపర్ , నైస్ అంటూ తెగ కామెంట్స్ పెట్టేశారు. మొత్తానికి పవన్ బర్త్ డే నాడు కూతురు మాంచి ట్వీట్ ఇచ్చింది.

ఇది కూడా చూడండి: మీ శరీరంలో తగినంత నీరు లేదని చెప్పే సూచనలు ఇవే

ఇది కూడా చూడండి: శ్రీహరి మృతికి అసలు కారణం చెప్పిన భార్య

ఇది కూడా చూడండి: ఈ నగరాల్లో బట్టలు వేసుకోవడం నిషిద్దం

English summary

Aadya said to renu desai " Mummy today nana bday so you must put nana pic on your phone". After that renu changing her DP just for her happiness.