ఖుషి 2 తెరకెక్కిస్తున్న రేణు

Renu Desai to Produce Khushi 2

12:05 PM ON 8th January, 2016 By Mirchi Vilas

Renu Desai to Produce Khushi 2

పవన్‌కళ్యాణ్‌ నెక్స్ట్‌ సినిమా గురించి ఒక కొత్త వార్త హల్‌చల్‌ చేస్తుంది. ఇటీవల ఖుషి డైరెక్టర్‌ యస్‌. జె. సూర్య ముంబై వెళ్ళినప్పుడు రేణుదేశాయ్‌ సూర్యని లంచ్‌కి ఆహ్వానించిందట. ఆ సందర్బంలో దిగిన ఒక ఫోటోను రేణు సోసల్‌ నెట్‌వర్క్‌ ద్వారా తన అభిమానులతో షేర్‌ చేసుకుంది. అయితే రేణు, సూర్యలు కలిసిన కారణం ఏమయి వుంటుందని రకరకాల చర్చలు కొనసాగాయి. చివరికి ఖుషి సీక్వెల్‌ విషయం భయటకి వచ్చింది. ఓ బాలీవుడ్‌ నిర్మాత సంస్థతో కలిసి ఈ సినిమా నిర్మించనుంది. ఒక సందర్బంలో పవన్‌ ను కలిసిన సూర్య ఈ సినిమా గురించి ప్రస్థావించాడట. రేణు దగ్గర కూడా ఈ విషయం మాట్లాడినట్టు తెలుస్తోంది. సూర్య డైరెక్షన్‌లో రేణు నిర్మాతగా ఖుషి సీక్వెల్‌ మొదలయ్యే అవకాశాలున్నాయి.

English summary

Renu Desai to Produce Khushi 2. pawan kalyan next movie planning news halchal in social media. Renu desai plans to produce kushi 2 Movie.