ఇంతకీ ఆ ట్వీట్ దేనికోసం ...

Renu Desai Tweet On The Rumors

11:07 AM ON 18th March, 2016 By Mirchi Vilas

Renu Desai Tweet On The Rumors

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి విడిపోయిన రేణు దేశాయ్, మళ్లీ అతని లైఫ్‌లోకి రీ ఎంట్రీ ఇస్తోందని గత కొంతకాలంగా వార్తలు వస్తున్న నేపథ్యంలోనే 'సర్దార్ గబ్బర్‌సింగ్' తర్వాత పవర్ స్టార్ నటించనున్న 'ఖుషి' సీక్వెల్‌కు సైతం రేణు దేశాయ్ నిర్మాత అనే వార్తలు కూడా షికారు చేస్తున్నాయి. ..అందుకే దర్శకుడు ఎస్.జే.సూర్య, సంగీత దర్శకుడితో ముంబైలో భేటీ అయినట్లు ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే రేణు సోషల్ మీడియా ద్వారా కొన్ని ఆసక్తికర ట్విట్స్ చేసింది. ‘‘వీటిలో నిజం లేదని...తాను ట్వీట్ చేస్తేనే అది నిజమని నమ్మాలని, మిగతావన్నీ క్రేజీ పీపుల్ క్రేజీగా ఊహించుకుంటున్నారని’’ పేర్కొంటూ రేణు ట్విట్ చేసింది. అది ఖుషి సీక్వెల్ గురించేనా లేదంటే ఏమైనా వేరే దానిపై అలా ట్విట్ చేసిందోనని అందరూ అంటున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో ...

English summary