క్షేమమే .... ముంబై లో దిగి ట్వీట్ చేసిన 'రేణు'

Renu Tweets a message in Twitter

06:01 PM ON 14th November, 2015 By Mirchi Vilas

Renu Tweets a message in Twitter

నిన్నటి దాకా ప్యారిస్‌లో గడిపిన సినీ తార రేణు దేశాయ్ సురక్షితంగా ఇండియా చేరింది. పైగా ఆమె బస చేసిన ప్రదేశంలోనే దాడి జరిగిందట. అయితే ఆమె ప్యారిస్ నుంచి బయలుదేరి , ఇండియా వచ్చే వరకు దాడి సంగతి తెలియదట . ఈమేరకు ఆమె క్షేమంగా వున్న విషయాన్ని ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. వివరాల్లోకి వెళితే టెర్రరిస్టులు విధ్వాంసకాండ సృష్టించిన విషయం తెలిసిందే. కొన్ని రోజుల క్రితం ప్యారిస్ వెళ్లిన పవన్ మాజీ భార్య అయిన రేణుదేశాయ్ ‘ఐయామ్ సేఫ్’ అంటూ ట్విట్ చేసింది. సరిగ్గా అక్కడ దాడులు జరిగే సమయానికి రేణు ముంబై బయల్దేరారు. శనివారం ఉదయం ముంబైలో ల్యాండ్ అయ్యానని, తాను క్షేమంగానే ఉన్నట్టు ట్వీట్ లో పేర్కొంది. అయితే... ముంబైలో దిగేవరకు ఆమెకు దాడి విషయం తెలియదట. ఇక్కడ దిగిన తరువాత ముందు రోజు వరకు తాను బస చేసిన ప్రాంతంలోనే ఉగ్రవాదులు దాడి చేశారన్న విషయం తెలిసి ఆందోళనకు గురయినట్లు ఆమె తెలిపింది. ‘ఫ్యారిస్నుంచి ఇప్పుడే ముంబయి వచ్చేశాను. ఇక్కడికి వచ్చాకే ప్యారిస్ లో ఉగ్రవాద దాడి జరిగిన సంగతి తెలిసింది. నా క్షేమం కోరుతూ శుభ సందేశాలు పంపించిన అందరికీ నా కృతజ్ఙతలు’ అంటూ రేణూ ట్వీట్ చేసింది. నిజంగా ఎంత అదృష్టం .....

English summary

Renu Tweets a message in Twitter. The attack took place on the spot where she stayed but she didn’t know that.