మరోసారి పవన్-వెంకీ కాంబో!

Repeating Venkatesh and Pawan Kalyan combination

03:27 PM ON 13th August, 2016 By Mirchi Vilas

Repeating Venkatesh and Pawan Kalyan combination

అందరితోనూ సన్నిహితంగా మెలిగే హీరో విక్టరీ వెంకటేష్. టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటిది ఈ ఇద్దరు హీరోలు తమ ఇమేజ్ లను, స్టార్ డమ్ ను పక్కన పెట్టి గోపాల గోపాల చిత్రంలో కలిసి నటించారు. అది కూడా హిందీలో సూపర్ హిట్ అయిన చిత్రంలో నటించి విజయం సాధించారు. అయితే గోపాల గోపాల సినిమా టైంలోనే వీరిద్దరు మరోసారి కలిసి నటించాలని ఆ సమయంలోనే అనుకున్నారట. ఆ విషయాన్ని ఇటీవల తన స్నేహితుడు త్రివిక్రమ్ తో పంచుకున్నాడట పవన్. వెంకటేష్ కామెడీ టైమింగ్ అంటే విపరీతంగా ఇష్టపడే త్రివిక్రమ్ ఆ కాంబినేషన్ లో పనిచేయడానికి ఆసక్తి చూపుతున్నట్టు సమాచారం.

వారిద్దరికీ సరిపోయే విధంగా స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో తివిక్రమ్ ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం పవన్ డాలీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమా పూర్తవగానే ఈ సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్లే అవకాశం ఉంది. ఈ సినిమాలో వెంకీ కూడా ఓ కీలక రోల్ లో నటిస్తాడని తెలుస్తోంది. గోపాల గోపాల కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతోంది. ఈ ప్రాజెక్ట్ గనుక పట్టాలెక్కితే ఎన్ని సంచనాలు సృష్టిస్తుందో చూడాలి మరి.

English summary

Repeating Venkatesh and Pawan Kalyan combination