ప్రశాంతం గా సాగుతున్న రీపోలింగ్

Repolling Continues In GHMC Elections

01:42 PM ON 5th February, 2016 By Mirchi Vilas

Repolling Continues In GHMC Elections

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ కి ఫిబ్రవరి 2న జరిగిన పోలింగ్ సందర్భంగా అక్రమాలు జరిగాయన్న ఆరోపణ నేపధ్యంలో ఎన్నికల సంఘం నిర్ణయం మేరకు పురానాపూల్‌ డివిజన్‌లో శుక్రవారం ఉదయం 7గంటలకు ప్రారంభమైన రీపోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం 12గంటల వరకు 39.50 శాతం పోలింగ్‌ నమోదైంది. డివిజన్‌ పరిధిలోని 36 కేంద్రాల్లో సాయంత్రం 5గంటల వరకు పోలింగ్‌ కొనసాగనుంది. పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్‌ ద్వారా ఎన్నికల సరళిని పర్యవేక్షిస్తున్నారు. పురానాపూల్‌ ప్రాంతంలో 800 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతో ఉదయం జరగాల్సిన ఓట్ల లెక్కింపు మద్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కానుంది. సాయంత్రం రీ పోలింగ్ ముగిసే సమయానికి తొలి ఫలితం వెల్లడి అయ్యలా చూస్తున్నారు. ఆర్ధరాత్రి లోగా అన్ని ఫలితాలు వస్తాయని అంటున్నారు.

English summary

Greater Hyderabad Municipal Corporation (GHMC) election results to come out at 5:00 PM today.Repolling Continues peacefully in Puranapool.