క్యాన్సర్ చికిత్సలో ఒక మలుపు

Research on Leukemia and Cancer got Good News

11:32 AM ON 29th December, 2015 By Mirchi Vilas

Research on Leukemia and Cancer got Good News

శాస్త్రవేత్తలు ల్యుకేమియా కణాలు ఒక దానితో ఒకటి చంపుకొనే పద్దతిని కనుగొన్నారు. అయితే ఇప్పటివరకు క్యాన్సర్ వ్యాధిని పూర్తిగా నివారించటానికి మందును కనుగొనలేదు. కానీ ఇటీవల జరిగిన పరిశోదనలలో శాస్త్రవేత్తలు పురోగతిని సాధించారు. లుకేమియా మరియు ఇతర క్యాన్సర్ ల కోసం మెరుగైన చికిత్సను కనుగొన్నారు.

1/5 Pages

క్యాన్సర్ - కొనసాగుతున్న పోరాటం

  • క్యాన్సర్ - కలకాలం ఒక శత్రువు నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ప్రకారం, US లో 2015 వ సంవత్సరంలో దాదాపుగా 1.6 మిలియన్ కొత్త క్యాన్సర్ కేసులు నమోదు అయ్యాయని మరియు 5,89,000 మంది చనిపోయే అవకాశం ఉందని తెలిపింది.
  • సాదారణంగా మన శరీరంలో అవసరం అయినప్పుడు కొత్త కణాల విభజన జరుగుతుంది. పాత మరియు పాడైపోయిన కణాలు చనిపోతాయి. వాటి స్థానంలో కొత్త కణాలు భర్తీ అవుతూ ఉంటాయి.
  • క్యాన్సర్ ఉన్నప్పుడు కణాల విభజన ఎక్కువగా జరుగుతుంది. అంతేకాక ఇది పరిసర కణజాలాలకు కూడా వ్యాప్తి చెందుతుంది. కాలక్రమేణా, కణాలు ఎక్కువగా అసాధారణ ప్రవర్తనను  ప్రదర్శిస్తాయి. దాంతో దెబ్బతిన్న మరియు పాత కణాలు నశించకుండానే కొత్త కణాల ఏర్పాటు మరియు విభజన జరుగుతుంది.
  • ఈ విధంగా ఎక్కువగా పెరిగిపోయిన కణాలు చివరకు క్యాన్సర్ కణితులుగా మారతాయి.
  • అయితే, అన్ని క్యాన్సర్లు కణితి రూపంలో బయటకు కనిపించవు. వాటికీ ఉదాహరణగా ల్యుకేమియా లేదా రక్త క్యాన్సర్ అని చెప్పవచ్చు.
  • అయితే ప్రస్తుతం క్యాన్సర్ చికిత్సలో కెమోథెరపీ మరియు రేడియేషన్ చికిత్సలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయి.
  • అయినప్పటికీ, వాటి ప్రభావం తీవ్రంగా ఉండటమే కాకుండా చాలా మందిలో అనేక దుష్ప్రభావాలు కలుగుతున్నాయి. ఇవి  ప్రాణాంతక క్యాన్సర్ కణాల వృద్ధిని నిరోదిస్తాయి అని అనుకుంటాం. కానీ అవి చుట్టుపక్కల ఉన్న ఆరోగ్యకరమైన కణాలను నాశనం చేయటమే కాకా చంపుతాయి.
  • క్యాన్సర్ చికిత్సను కనుగొనడంలో సఫలం అయినా, చికిత్స కష్టంగానే ఉంది. అయితే కొన్ని  ప్రతిరక్షక (యాంటీబాడీ) కారకాలను క్యాన్సర్ కణాలుగా మార్చి మిగిలిన ప్రాణాంతక కణాలను బహిష్కరించే విధంగా ఒక మార్గం ఉంది.
  • 2015 వ సంవత్సరంలో స్క్రిప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (TSRI) శాస్త్రవేత్తలు నిర్వహించిన అధ్యయనంలో, నూతన క్యాన్సర్ చికిత్స తర్వాత అన్ని కార్యాచరణలను సాదించవచ్చని కనుగొన్నారని నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ తన పత్రికలో ప్రచురించింది.

English summary

Scientists, who are doing research on leukemia and cancer recently discovered the main reason cancer and discovered some treatment to cure.